Krishna River : భారీ వర్షం కృష్ణా నది ఉగ్ర రూపం
మరికొన్ని రోజుల పాటు వర్షాలు
Krishna River : బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వాయు గుండంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కుండ పోతగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి కృష్ణా , గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరికొన్ని నదులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.
Krishna River Flow
రోజు రోజుకు కృష్ణా(Krishna River) వరద ఉధృతి పెరగడంతో ఏపీ లోని ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం మరింత పెరిగింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 2.33 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో కృష్ణా నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించారు.
మరో వైపు గోదావరి నది సైతం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎక్కడ చూసినా నీళ్లే. భద్రాచలంకు భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. అవసరమైతే తప్పా బయటకు రావద్దని హెచ్చరించారు. చేపల వేటకు వెళ్లే మత్స్య కారులు కొన్ని రోజులు సముద్రతీరానికి వెళ్ల వద్దని సూచించారు ఎండీ.
ఇదే సమయంలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సహాయక చర్యలు చేపట్టింది సీఎం జగన్ రెడ్డి ఆదేశాల మేరకు.
Also Read : BRO Movie : బ్రో ది అవతార్ సూపర్