Bengaluru Floods : బెంగళూరులో ట్రాక్టర్లపై ఆఫీసులకు టెక్కీలు
వర్షాల బీభత్సం జన జీవనం అస్తవ్యస్తం
Bengaluru Floods : భారీ వర్షాల తాకిడికి కర్ణాటక విలవిలాడింది(Bengaluru Flood ) . ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు జన జీవనం పూర్తిగా స్తంభించి పోయింది. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సాఫ్ట్ వేర్ కంపెనీలలో పనిచేసే టెక్కీలు (సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ) ఏకంగా కార్లు వెళ్లేందుకు ఆస్కారం లేక పోవడంతో ట్రాక్టర్ల ద్వారా ఆఫీసులకు వెళ్లడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి.
వరుసగా కురుస్తున్న వర్షాలు ఈరోజుతో మూడో రోజుకు చేరుకున్నాయి. విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయి.
దీంతో బెంగళూరులో చోటు చేసుకున్న తీవ్ర పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రూ. 300 కోట్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు.
సహాయక చర్యలు ముమ్మరం చేశామని , ఎవరూ బయటకు రావద్దని కేవలం అత్యవసరమైతే తప్ప అని తెలిపారు. పలు చోట్ల నీటి సరఫరాకు ఇబ్బంది ఏర్పడింది.
ఇదిలా ఉండగా వారం రోజుల్లో రెండవసారి వరదలు సంభవించడం ప్రణాళికేతర పట్టణీకరణపై దృష్టి సారించింది.
శరవేగంగా అభివృద్ది చెందుతున్న నగరంలో ప్రణాళికేతర అభివృద్ది కారణంగా సంభవించిన నష్టాన్ని భారీ వర్షాల కారణంగా బెంగళూరులో(Bengaluru Flood) ని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.
కొన్ని కీలకమైన రోడ్లు జలయం అయ్యాయి. పూర్తిగా ట్రాఫిక్ జామ్ తో ఏర్పడింది. మెగా ఐటీ హబ్ ను వరదలు ముంచెత్తడంతో ప్రజలు ట్రాక్టర్లు, క్రేన్ లు ఎక్కారు.
ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా బడుల్ని మూసి వేసింది. విద్యుత్ షాక్ కు గురై ఇద్దరు మరణించినట్లు సమాచారం.
Also Read : వెనుకాల ఉన్నోళ్లు బెల్ట్ వద్దనుకుంటారు
Flood in Bengaluru, India. This is from the posh Sunny Brooks Layout at Sarjapur road.
The tractors are back out in #Bengaluru's residential layouts. #FloodinIndia #bangalorerains #floods #news pic.twitter.com/aqoGRHFBtl
— We Are Protestors (@WeAreProtestors) September 5, 2022