Heavy Rains Bangalore : ముంచెత్తిన వర్షం బెంగళూరు అతలాకుతలం
ఎడ తెరిపి వానలతో జన జీవనం అస్తవ్యస్తం
Heavy Rains Bangalore : కర్ణాటకను వర్షాలు ముంచెత్తాయి. ప్రధానంగా రాజధాని నగరం బెంగళూరు అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి జన జీవనం స్తంభించింది.
నగరంలోని మారతహళ్లి, ఔటర్ రింగ్ రోడ్ , ఇతర ప్రాంతాలు తల్లడిల్లాయి. పలు వాహనాలు తేలియాడడం విశేషం. నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనుకోకుండా కురిసిన వర్షం దెబ్బకు(Heavy Rains Bangalore) లబోదిబోమంటున్నారు స్థానికులు.
పరిస్థితి గురిచి ప్రజలకు తెలియ చేసేందుకు ట్రాఫిక్ ఆఫీసర్లు సోషల్ మీడియా ద్వారా బయటకు రావద్దని, ఏదైనా సాయం కావాల్సి వస్తే తమకు తెలియ చేయాలని కోరారు.
అనవసర ప్రచారాన్ని నమ్మ వద్దని సూచించారు. భారీ వర్షాల కారణంగా నగరం జలమయం కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.అనేక ప్రాంతాలు వరదలకు గురయ్యాయి.
అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని స్పష్టం చేశారు. ఎక్కడికైనా వెళ్లే వారు కొన్ని రోజుల పాటు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు పోలీసులు.
చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రాక పోకలు పూర్తిగా నిలిచి పోయాయి. ఈస్ట్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కళా కృష్ణ స్వామి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరదల బీభత్సం కారణంగా జాగ్రత్తలు పాటించాలని సూచించింది రాష్ట్ర ప్రభుత్వం.
ఇదిలా ఉండగా బెంగళూరులోని మూడు ప్రాంతాల్లో(Heavy Rains Bangalore) రాత్రిపూట 125 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మారత హల్ళి, దొడ్డనెక్కుండి ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.
ఇక బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో పలు విమానాల రాక పోకలు స్తంభించి పోయాయి.
Also Read : యుకె బిలియనీర్ షాకింగ్ కామెంట్స్