Heavy Rains : భారీ వ‌ర్షం జర భ‌ద్రం

కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Heavy Rains : బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడ‌నం కార‌ణంగా భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఇప్ప‌టి దాకా ఎడ తెరిపి లేకుండా కురుస్తుండడంతో భాగ్య‌న‌గ‌రం అత‌లాకుత‌ల‌మైంది. రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. నాలాలు పొంగి పొర్లి ప్ర‌వ‌హిస్తున్నాయి. ఎక్క‌డ చూసినా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.

Heavy Rains in Hyderabad

కుండ పోత‌గా కురుస్తున్న వ‌ర్షాల దెబ్బ‌కు చెరువులు, కుంట‌లు పొంగి పొర్లి ప్ర‌వ‌హిస్తున్నాయి. చాలా చోట్ల జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకున్నాయి. ఇదిలా ఉండ‌గా న‌గ‌ర‌వాసులు అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని కోరారు మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్.

అన్ని స్థాయిల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు సంబంధించి జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 21111111, 23225397 నంబర్లను సంప్రదించాలని సూచించారు మంత్రి.

భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, ట్రాన్స్ కో ఎండీ, ఈవీడీఎం డైరెక్టర్, కలెక్టర్ తో మాట్లాడారు శ్రీ‌నివాస్ యాద‌వ్(Talasani Srinivas Yadav). ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వాటర్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాల‌న్నారు మంత్రి.

Also Read : Gangula Kamalakar : మంత్రి గంగుల‌కు ఈడీ షాక్

Leave A Reply

Your Email Id will not be published!