Hyderabad Red Alert : హైదరాబాద్ కు రెడ్ అలర్ట్
భారీగా వర్షాలు కురిసే ఛాన్స్
Hyderabad Red Alert : బంగాళా ఖాతం దెబ్బకు భాగ్యనగరం చిగురుటాకులా వణుకుతోంది. ఎక్కడ చూసినా నీళ్లే దర్శనం ఇస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది అహోరాత్రులు శ్రమిస్తున్నారు. విధులు నిర్వహిస్తున్నారు. అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుండడంతో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి జన జీవనం స్తంభించి పోయింది.
Hyderabad Red Alert Announced
గత మూడు రోజులుగా కుండ పోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హైదరాబాద్ తడిసి ముద్దవుతోంది. నగరంలోని రోడ్లన్నీ నీళ్లతో నిండి పోయాయి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. భారీ ఎత్తున వాహనాలు నిలిచి ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు.
భారీ ఎత్తున మరికొన్ని గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె. నాగరత్న హెచ్చరించారు(Hyderabad Red Alert). నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎంతో అవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. రాత్రి గంటకు 5 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్ల వరకు వర్షాలు కురుస్తాయని అన్నారు. అంతే కాకుండా 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆయన ప్రగతి భవన్ లో సమీక్ష చేపట్టారు.
Also Read : CM KCR Announce : భారీ వర్షం సెలవుకు ఆదేశం