Heavy Rains Karnataka : కన్నడ నాట ముంచెత్తిన వర్షం
భారీ వర్షాల తాకిడికి జన జీవనం అస్తవ్యస్తం
Heavy Rains Karnataka : నైరుతి రుతు పవనాలు గత ఏడాది కంటే ఈసారి లేటుగా వచ్చాయి. కానీ భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఓ వైపు కన్నడ నాట కుండ పోతగా కురుస్తుంటే మరో వైపు దేశ ఆర్థిక రాజధాని ముంబై వణుకుతోంది.
వందలాది మంది నిరాశ్రయులుగా మారారు. కొలువు తీరిన కొత్త ప్రభుత్వం సహాయక చర్యలలో మునిగి పోయింది. ఇక కర్ణాటకలో నిన్నటి నుంచి కంటిన్యూగా కురుస్తూనే ఉన్నాయి వర్షాలు.
ఇక రుతు పవనాల దెబ్బకు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్షాల తాకిడి అధికంగానే ఉంది. ఇక కర్ణాటక లోని కొడగు, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపి, తదితర ప్రాంతాలలో భారీ వర్షాలు(Heavy Rains Karnataka) కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా బడులు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ఇప్పటికే పలు చోట్ల వర్షాల దెబ్బకు కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
సహాయక చర్యలు చేపట్టాలని సీఎం బసవరాజ్ బొమ్మై ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాలలోకి నీరు చేరుకుంది.
ఇక ముంపు ప్రాంతాల ప్రజలను తాత్కాలిక, శాశ్వత పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యలను జిల్లాల డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు.
వర్షాల దెబ్బకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. తీర ప్రాంతాల తో పాటు మల్నాడు జన జీవనం స్తంభించి పోయింది. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
Also Read : అక్షరానికి పట్టం అరుదైన పురస్కారం