Floods Deaths : భారీ వర్షం మిగిల్చిన విషాదం 17..మంది మృతి
17 మంది మృతి..ఆర్థిక సాయం
Floods Deaths : బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం వాయుగుండంగా మారింది. దీంతో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కృష్ణా నది, తుంగ భద్ర, గోదావరి నదులు పొంగి పొర్లుతున్నాయి.\
Floods Deaths People
వర్షాల ధాటికి తెలంగాణ రాష్ట్రంలో 17 మంది మృతి చెందారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. వర్షాల కారణంగా ఉమ్మడి వరంగల్ , ఖమ్మం జిల్లాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు(Floods Deaths). ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రాష్ట్ర పోలీసు, అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాలు పంచుకున్నారు.
వర్షాల కారణంగా 9 మంది గల్లంతయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతి చెందిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల పరిహారం , తక్షణ సాయం కింద 25 వేల రూపాయలు మంజూరు చేస్తామని ప్రకటించారు మంత్రి సత్యవతి రాథోడ్.
మృతి చెందిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల పరిహారం.. తక్షణ సాయం కింద 25 వేల రూపాయలు మంజూరు చేస్తామని ప్రకటించిన మంత్రి సత్యవతి రాథోడ్. ములుగు జిల్లాలో 8 మంది , హనుమకొండ జిల్లాలో ముగ్గురు , మహబూబాద్ జిల్లాలో ఇద్దరు, భూపాలపల్లి జిల్లాలో ఒకరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు వరదల్లో కొట్టుకు పోయి మృతి చెందారు.
Also Read : Priya Ponguru : నారాయణ మామూలోడు కాదు