Heavy Rains Telangana : తెలంగాణ‌లో రెడ్ అల‌ర్ట్

భారీ వ‌ర్షాల‌తో జ‌ర భ‌ద్రం

Heavy Rains Telangana : బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వాయుగుండంగా మారింది. ఎడ తెరిపి లేకుండా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర‌మంత‌టా వాన‌లు దంచి కొడుతున్నాయి. ప్ర‌త్యేకించి రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ చిగురుటాకులా వ‌ణికి పోయింది. ఎక్క‌డ చూసినా నీళ్ల‌తో నిండి పోయింది. వేలాది వాహ‌నాలు రోడ్ల‌పైనే నిలిచి పోయాయి. గంట‌ల కొద్దీ వాహ‌న‌దారులు ఉండి పోయారు.

Heavy Rains Telangana Due to Storm

రాష్ట్ర వాతావ‌ర‌ణ శాఖ ముంద‌స్తు హెచ్చ‌రిక జారీ చేసింది. రాష్ట్ర మంత‌టా రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. అత్య‌వ‌స‌రం అనుకుంటే త‌ప్ప బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు రాష్ట్ర స‌ర్కార్ స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించింది. మ‌రో మూడు రోజుల పాటు వ‌ర్షాలు ఇలాగే కురుస్తాయ‌ని జాగ్ర‌త్తగా ఉండాల‌ని సూచించింది.

లోత‌ట్టు ప్రాంతాల‌లో ఉన్న వారు స‌హాయ‌క శిబిరాల‌లో ఉండాల‌ని పేర్కొంది. విద్యుత్ స్తంభాలు ఒరిగి పోయే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొంది. జూలై 28 శుక్ర‌వారం వ‌ర‌కు కుండ పోత‌గా వ‌ర్షాలు(Heavy Rains) కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలోని వ‌రంగ‌ల్ , హ‌నుమ‌కొండ‌, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబాబాద్ , సూర్యా పేట‌, వికారాబాద్ , రంగారెడ్డి, మెద‌క్, సంగారెడ్డి, కామారెడ్డి , ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, కామారెడ్డి, క‌రీంన‌గ‌ర్ , పెద్ద‌ప‌ల్లి, మంచిర్యాల‌, నిర్మ‌ల్ , న‌ల్ల‌గొండ‌, హైద‌రాబాద్ , మ‌హారాజ్ న‌గ‌ర్ , హైద‌రాబాద్ జిల్లాలో రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

Also Read : Raghav Chadha : మోదీ మౌనం ప్ర‌మాద‌క‌రం – చ‌ద్దా

 

Leave A Reply

Your Email Id will not be published!