Amritpal Singh : దొరకని సింగ్ బటిండాలో భద్రత
మార్చి 18 నుంచి పరారీలోనే అమృత పాల్
Amritpal Singh : మరో భింద్రన్ వాలేగా పేరు పొందిన అమృత పాల్ సింగ్ గత నెల మార్చి 18న పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నాడు. ఇప్పటి వరకు అతడిని పోలీసులు పట్టుకోలేక పోయారు. ఇంకా గాలింపు చర్యల్లోనే నిమగ్నం అయ్యారు. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో బైసాఖీ వేడుకలు జరగనున్నాయి. దీనికి కచ్చితంగా ఖలిస్తాన్ అనుకూల వాదిగా పేరొందిన అమృతపాల్ సింగ్(Amritpal Singh) హాజరవుతాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
దీంతో బైసాఖీ జరిగే బటిండాలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 144 సెక్షన్ కూడా విధించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆయుధాలు కలిగిన వారి లైసెన్సులు రద్దు చేసింది సర్కార్. సీఎం భగవంత్ మాన్ దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా తాను పారి పోలేదని , త్వరలో ప్రపంచం ముందుకు వస్తానని, మీకందరికీ కనిపిస్తానంటూ ఓ వీడియో సందేశం పంపడం కలకలం రేపింది.
అమృత పాల్ సింగ్ ఖలిస్తానీ బోధకుడిగా ఉన్నారు. అంతే కాదు వారిస్ పంజాబ్ దే చీఫ్ గా కొనసాగుతున్నారు. అమృతపాల్ సింగ్ బైసాఖీ సమ్మేళనం గురించి ప్రచారం చేయాలని కోరుతూ ప్రోత్సహిస్తున్న ధృవీకరించని వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై స్పందించారు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సురీందర్ పాల్ సింగ్ పర్మార్.
పంజాబ్ లో ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందన్నారు. బైసాఖీ సమ్మేళనం ఏప్రిల్ 14న జరగనుంది. నేను జుట్టు కత్తిరించానని అంటున్నారు. కానీ నేను జుట్టు కత్తిరించే ముందు నా తల కత్తిరించుకుంటానని ప్రకటించాడు అమృతపాల్ సింగ్(Amritpal Singh).
Also Read : అయోధ్యలో షిండే..ఫడ్నవీస్