Kedarnath: గింగరాలు తిరిగిన హెలికాప్టర్ ! కేదార్ నాథ్ లో తప్పిన పెను ప్రమాదం !
గింగరాలు తిరిగిన హెలికాప్టర్ ! కేదార్ నాథ్ లో తప్పిన పెను ప్రమాదం !
Kedarnath: ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్‌లో శుక్రవారం ఉదయం పెనుప్రమాదం తప్పింది. కెస్ట్రెల్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ హైడ్రాలిక్ వ్యవస్థ విఫలం కావడంతో అత్యవసర ల్యాండయ్యింది. అయితే ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపంతో హెలికాప్టర్ వేగంగా గింగరాలు తిరిగింది. హెలిప్యాడ్ వద్ద ఉన్న వాళ్లంతా భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. పైలట్ కల్పేశ్ చాకచక్యంగా వ్యవహరించి… హెలిప్యాడ్ కు 100 మీటర్ల దూరంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీనితో హెలికాప్టర్ లో ఉన్న ప్రయాణీకులు సురక్షితంగా కిందికి దిగారు.
Kedarnath….
కెస్ట్రెల్ ఏవియేషన్‌కు చెందిన ఈ హెలికాప్టర్ సిర్సి నుంచి ఆరుగురు భక్తులతో కేదార్ నాథ్ కు బయలుదేరింది. అనంతరం ఏడు గంటల సమయంలో హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీనితో అప్రమత్తమైన పైలట్ హెలిప్యాడ్ కు కొన్ని మీటర్ల దూరంలో దానిని సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేసారు. అయితే ల్యాండింగ్ అయ్యే సమయంలో హెలికాప్టర్ గిరగిరా తన చుట్టూ తాను తిరగడంతో… సమీపంలో ఉన్న వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై పరుగులు తీసారు. అయితే పైలట్ కల్పేశ్ చాకచక్యంగా వ్యవహరించి… హెలిప్యాడ్ కు వంద మీటర్ల దూరంలో పచ్చికబయళ్ళపై సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ సౌరభ్ గాహర్వర్ తెలిపారు.
Also Read : Marriage Function: పెళ్లి పీటలపైనే వధువుకు వరుడి ముద్దు ! కొట్లాటకు దారి తీసిన వరుడి ముద్దు !