AP CM YS Jagan : ఏపీ రాజ‌ధానిపై సీఎం ప్ర‌క‌ట‌న

విశాఖ ప‌ట్ట‌ణానికే ప్ర‌యారిటీ

CM YS Jagan AP Capital City : ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(CM YS Jagan) మ‌రోసారి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖ ప‌ట్ట‌ణంలో శుక్ర‌వారం ప్రారంభ‌మైంది గ్లోబ‌ల్ స‌మ్మిట్ . ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇక నుంచి ఏపీకి రాజ‌ధాని విశాఖ న‌గ‌ర‌మే ఉంటుంద‌న్నారు. 

ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఏపీకి మూడు రాజ‌ధానులు అన్న విష‌యంపై కూడా క్లారిటీ ఇచ్చారు. మ‌రోసారి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేస్తున్న‌ట్లు తెలిపారు సీఎం. గ‌తంలో ఢిల్లీ వేదిక‌గా వ్యాపార‌వేత్త‌ల‌తో జ‌రిగిన మీటింగ్ లో కూడా దీనిపై స్ప‌ష్టం ఇచ్చారు జ‌గ‌న్ రెడ్డి.

వేలాది మంది వ్యాపార‌వేత్త‌లు, ప్ర‌ముఖులు , ఔత్సాహికులు ఈ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు హాజ‌ర‌య్యారు. విశాఖ న‌గ‌రం ఇక నుంచి ఏపీకి కీల‌కంగా మార‌నుంద‌న్నారు. అన్ని హంగులు క‌లిగిన ప్రాంతంగా దీనికి పేరుంద‌ని చెప్పారు సీఎం. సాగ‌ర తీరం సాక్షిగా మ‌రోసారి తాను క్లారిటీ ఇస్తున్నాన‌ని నిర‌భ్యంత‌రంగా ఇక్క‌డ ప‌రిశ్ర‌మ‌లు పెట్ట‌వ‌చ్చ‌ని, పెట్టుబడుల‌కు ఆస్కారం ఉంద‌న్నారు సీఎం(CM YS Jagan AP Capital City) .

ఏపీ రాష్ట్రానికి కార్య‌నిర్వాహ‌క రాజ‌ధానిగా విశాఖ ప‌ట్ట‌ణం ఉండ‌బోతంద‌న్నారు. తాను కూడా త్వ‌రలోనే ఇక్క‌డికి వ‌స్తాన‌ని చెప్పారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. సీఎం ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే ఇక్క‌డ మౌలిక స‌దుపాయాల‌పై ఫోక‌స్ పెట్టారు ఉన్న‌తాధికారులు.

ఇదిలా ఉండ‌గా కాపులుప్పాడ ఐటీ పార్కులో భ‌వ‌నాలు కూడా సిద్దం చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి. దీంతో గ‌త కొంత కాలంగా రాజ‌ధానుల విష‌యంలో చోటు చేసుకున్న అనుమానాల‌ను పూర్తిగా నివృత్తి చేశారు ఏపీ సీఎం.

Also Read : రూ. 30 ల‌క్ష‌ల కోట్ల ప్ర‌తిపాద‌న‌లు – జ‌గ‌న్

Leave A Reply

Your Email Id will not be published!