UP Election 2022 : దేశం యావత్ ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ వైపు చూస్తోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని యోగి సర్కార్ తమ పనితీరుకు రెఫరెండమ్ గా భావిస్తున్నారు పార్టీ శ్రేణులు.
దేశంలోనే అత్యంత ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగి ఉన్న ప్రాంతం ఇది. అధికారంలో ఉన్న యోగి (UP Election 2022)మరోసారి పవర్ లోకి రావాలని ట్రై చేస్తుండగా ఈసారి సమాజ్ వాది పార్టీతో నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది ప్రచారం.
ప్రధానంగా ప్రధాని మోదీ, అమిత్ షా ఈ ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్నారు. ఎస్పీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ (UP Election 2022)ఈసారి గట్టి పోటీని ఇస్తున్నారు.
సమాజ్ వాది తో పాటు కాంగ్రెస్, బహుజన్ సమాజ్ వాది పార్టీ, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, తదితర పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నాయి. మొత్తం 403 శాసనసభ నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతాయి.
కేంద్ర ఎన్నికల సంఘం ఏడు విడతలుగా చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు నాలుగు విడతల పోలింగ్ ముగిసింది. చెదురు మదురు సంఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ముగిసింది.
ఈనెల 27న ఆదివారం జరగనుంది. మొత్తం 692 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిని 2 కోట్ల 24 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించనున్నారు.
ఇందులో భాగంగా చిత్రకూట్, సుల్తాన్ పూర్ , ప్రతాప్ గఢ్ , కొషంబి, ప్రయాగ్ రాజ్ , బారా బంకి, బహ్రెచ్ , స్రవస్తి, గోండా, అమేధి, రాయ్ బరేలి రామ మందిర నిర్మాణ ఉద్యమ కేంద్రం అయోధ్యలో ఐదో దశ పోలింగ్ జరగనుంది. వీరిలో కేశవ్ ప్రసాద్ మౌర్య బరిలో ఉన్నారు.
Also Read : ఢిల్లీలో వడగళ్ల వానతో పరేషాన్