Himachal Pradesh Drama : సీఎం ఎంపిక నిరసన సెగ
దైవభూమిలో నువ్వా నేనా
Himachal Pradesh Drama : దైవభూమిగా పేరొందిన హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) లో మెజారిటీ వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇంకా సీఎం అభ్యర్థిని ఖరారు చేయలేక పోతోంది. ఇప్పటికే సిమ్లాలో పార్టీ పరిశీలకులు సమావేశం నిర్వహించారు. ఎన్నికైన 40 మంది ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో దివంగత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
సిమ్లాలోని రాడిసన్ హోటల్ లో కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 40 సీట్లను కైవసం చేసుకుంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆ పార్టీకి కేవలం 25 సీట్లు మాత్రమే దక్కాయి.
ఇదిలా ఉండగా సీఎం పీఠం కోసం కాంగ్రెస్ పార్టీలో పోటీ నెలకొంది. నువ్వా నేనా అన్న రీతిలో బల ప్రదర్శనకు దారి తీసింది. ఈ తరుణంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఇన్ చార్జ్ , బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాతో పాటు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేంద్ర బాఘేల్ శుక్రవారం చేరుకున్నారు .
ఈ సందర్భంగా ప్రతిభా సింగ్ మద్దతుదారులు వారిని అడ్డుకున్నారు. కావాలని కుట్ర చేస్తున్నారంటూ నినాదాలు చేశారు. బాఘేల్ కారును ఒకానొక దశలో వెళ్ల లేక పోయింది. ప్రతిభా సింగ్ ను సీఎంగా చేయాలని వారు డిమాండ్ చేశారు. వేరే ఎవరినైనా చేస్తే తాము ఒప్పుకోమని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా సీఎం పదవి రేసులో సుఖ్ వందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్ని హోత్రి, హర్షవర్దన్ చౌహాన్ ఉన్నారు. ఇదిలా ఉండగా తమలో గ్రూపు ఇజం లేదన్నారు ప్రతిభా సింగ్.
Also Read : ఆప్తాబ్ పూనావాలాను ఉరి తీయండి