Himachal Pradesh Bus : లోయలో పడ్డ బస్సు 16 మంది మృతి
ప్రధాన మంత్రి మోదీ దిగ్భ్రాంతి
Himachal Pradesh Bus : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సైంజ్ కు వెళుతున్న బసు జంగ్లా గ్రామ సమీపం లోని లోయలో బస్సు పడి పోయింది.
ఇప్పటి వరకు 16 మంది మృతి చెందారని డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ వెల్లడించారు. ఈ ఘటనలో విద్యార్థులతో పాటు ప్రయాణికులు మృతి చెందినట్లు తెలిపారు.
ప్రయాణం చేస్తున్న బస్సు(Himachal Pradesh Bus) పడి పోవడంతో భారీగా దెబ్బ తింది. జిల్లా అధికారులు, రెస్క్యూ టీమ్ లు రంగంలోకి దిగాయి. సంఘటన సమాచారం తెలిసిన వెంటనే హుటా హుటిన అక్కడికి చేరుకున్నాయని అశుతోష్ గార్గ్ తెలిపారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని తెలియ చేశారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi).
మరణించిన కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.
గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా కింద ఇవ్వనున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది.
రాష్ట్ర యాంత్రంగం మొత్తం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఘటన ఎలా జరిగిందనే దానిపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. మరో వైపు సహాయక చర్యలపై వివరాలు ఇవ్వాల్సిందిగా పిఎంఓ ఆదేశించింది.
Also Read : మహిళా సంకల్పం గొప్పది – మోదీ