Mohan Bhagwat : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ చాలక్ మోహన్ భగవత్ (Mohan Bhagwat)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజం ఎవరితో గొడవలు పెట్టుకోవాలని కోరుకోదన్నారు.
సర్వ మత సమ్మేళనమే తమ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్ ఆశ్రమాన్ని సందర్శించారు.
ఆయనతో పాటు మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు హాజరయ్యారు. వారికి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి సాదర స్వాగతం పలికారు.
అనంతరం యాగశాలను సందర్శించారు. రిత్వికులు, వేద పండితులు, ఆచార్యులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం రూ. 1000 కోట్లతో నిర్మించిన సమతా కేంద్రాన్ని పరిశీలించారు.
అక్కడ 216 అడుగులతో ఏర్పాటు చేసిన సమతామూర్తి శ్రీ భగవద్ రామానుజాచార్యుల విగ్రహాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ధర్మాచార్య సభలో ప్రసంగించారు.
మన సనాతన ధర్మంలో అన్నీ ఉన్నాయని చెప్పారు. దేశంలో ఆలయాల నిర్మాణం వేగంగా జరుగుతోందని అన్నారు. మనం గత కొంత కాలంగా ఎవరమనే దానిని మరిచి పోయామని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat).
108 దివ్య క్షేత్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రామానుజుడు చూపిన మార్గం దేశానికి ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు మధ్య ప్రదేశ్ సీఎం శివ రాజ్ సింగ్ చౌహాన్.
మొత్తం మీద ముచ్చింతల్ ఆశ్రమం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా ఈనెల 14 వరకు శ్రీ రామానుజ సమారోహ మహోత్సవాలు కొనసాగుతాయి. 13న రాష్ట్రపతి రానున్నారు ఆశ్రమానికి.
Also Read : అమ్మ వారి అనుగ్రహం జగన్ సంతోషం