Worshipper Dances : కోర్టు తీర్పుతో హిందువుల సంబురాలు
జ్ఞానవాపి మసీదు కేసులో కీలక తీర్పు
Worshipper Dances : జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి సోమవారం వారణాసి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తమకు అనుకూలంగా రావడంతో హిందువులు పెద్ద ఎత్తున సంబురాల్లో(Worshipper Dances) మునిగి పోయారు.
తమకు కొలిచేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సవాల్ చేస్తూ ముస్లిం కమిటీ సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించింది.
దీనిపై మొదట సుప్రీంకోర్టులో కేసు పరిశీలించి విచారించింది. చివరకు కీలకమైన తీర్పు ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
జ్ఞాన వాపి కేసుకు సంబంధించి తమకంటే ఎక్కువ స్థానిక కోర్టుకు ఎక్కువగా అవగాహన ఉంటుందని అందుకే ఈ కేసును తాము పరిశీలించడం భావ్యం కాదని పేర్కొంది.
ఈ మేరకు ఈ కేసును యూపీలోని వారణాసి కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో జ్ఞానవాపి కేసుకు సంబంధించి సోమవారం విచారణ చేపట్టింది.
కీలకమైన, ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముస్లింలు వేసిన పిటిషన్ ను కొట్టి వేస్తున్నట్లు ఏక సభ్య ధర్మాసనం ప్రకటించింది. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు చెప్పడంతో హిందూ సోదర సోదరణీమనులు పెద్ద ఎత్తున సంబురాల్లో మునిగి పోయారు.
ఇవాళ దేశ వ్యాప్తంగా సంతోషకరమైన తీర్పుతో సంబురాలు మునిగి పోయారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రతి ఒక్కరు దీపాలను వెలిగించాలని విన్నవించారు బీజేపీకి చెందిన మంజు వ్యాస్.
ఆమె కోర్టులో పిటిషన్ వేసిన ఐదుగురు మహిళలలో ఒకరుగా ఉన్నారు. ఆమె హర్ హర్ మహాదేవ్ అంటూ పేర్కొన్నారు.
Also Read : జ్ఞానవాపి కేసులో ముస్లింలకు బిగ్ షాక్