Assam CM : హిందువులు అల్లర్లకు దూరం – సీఎం
అన్ని మతాలు మాకు సమానం
Assam CM : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(Assam CM) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన జాతీయ ఛానల్ తో మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా హిందువులు ప్రధానంగా భారతీయులు అల్లర్లకు పాల్పడిన దాఖలాలు కానీ లేదా సహకరించినట్లు కానీ ఉండదన్నారు. హిందువులు శాంతి కాముకులు, వారికి హింసకు పాల్పడడం తెలియదన్నారు.
దేశాన్ని విభజించాలని అనుకునేవాళ్లు, ఉగ్రవాదులు వేరే మతాలకు చెందిన వారై ఉంటారన్నారు సీఎం. ఇదిలా ఉండగా 2002లో జరిగిన అల్లర్లకు తగిన గుణపాఠం నేర్పుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా చేసిన కామెంట్స్ పై సీరియస్ గా స్పందించారు హిమంత బిస్వా శర్మ.
గోద్రా ఘటన అనంతరం చోటు చేసుకున్న అల్లర్ల తర్వాత గుజరాత్ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు అనేక చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు అస్సాం సీఎం. ఈ దేశంలో ప్రస్తుతం లవ్ జిహాద్ గురించి చర్చ జరుగుతోందని, ఇది ఉగ్రవాదనికి మరో రూపం అని ఆరోపించారు.
ఈ దేశంలో శాంతిని కోరుకునే వారు మాత్రమే ఉంటారని హింసను ప్రేమించే వాళ్లు పాకిస్తాన్ లో ఉంటారని స్పష్టం చేశారు. తాము ఎవరి పట్ల ద్వేష భావంతో ఉండమన్నారు సీఎం(Assam CM). అయితే ప్రతిపక్షాలు తమను వేరే మతాలకు వ్యతిరేకం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయని ఇది పూర్తిగా అవాస్తవమన్నారు సీఎం.
వామపక్ష భావాలు కలిగిన వారు ఎవ్వరికైనా ఇది మత పరమైన కామెంట్స్ గానే కనిపిస్తాయని మండిపడ్డారు. కానీ అమిత్ షా చేసిన కామెంట్స్ ను జాతీయ ప్రయోజనాల దృష్టిలో చూడాలన్నారు హిమంత బిస్వా శర్మ.
Also Read : ప్రజాస్వామ్యం భారతదేశానికి మూలం