Rahul Gandhi Heera Ben : హీరా బెన్ మ‌ర‌ణం బాధాక‌రం

తీవ్ర సంతాపం తెలిపిన కాంగ్రెస్ నేత

Rahul Gandhi Heera Ben : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ త‌ల్లి హీరా బెన్ మోదీ వందేళ్ల వ‌య‌స్సులో క‌న్ను మూశారు. ఇవాళ గాంధీ న‌గ‌ర్ లో అంత్య‌క్రియ‌లు ముగిశాయి. స్వ‌యంగా మోదీ త‌న త‌ల్లి అంత్య‌క్రియ‌ల‌లో పాల్గొన్నారు. చివ‌రిసారిగా హీరా బెన్ పార్థివ దేహాన్ని మోశారు. ఆయ‌న క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు.

త‌న జీవితాంతం ఆమె ఎవ‌రిపై ఆధార ప‌డలేదు. చివ‌రి దాకా త‌న ప‌నులు తానే చేసుకున్నారు. హీరా బెన్ మృతి ప‌ట్ల కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు సోనియా గాంధీ, అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi Heera Ben) తీవ్ర సంతాపం తెలిపారు. ఈ విషాద స‌మ‌యంలో దేవుడు ప్ర‌ధాని మోదీకి, కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌శాంత‌త‌ను చేకూర్చాల‌ని కోరారు.

పిల్ల‌ల‌తో త‌ను గ‌డిపిన క్ష‌ణాలు గొప్ప‌వి. ఈ త‌రుణంలో హీరా బెన్ ను కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఈ క్లిష్ట స‌మ‌యంలో ప్ర‌ధాన మంత్రికి, కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నాను అని ట్వీట్ చేశారు. ఈ విషాద స‌మ‌యంలో నాకు మాట‌లు రావ‌డం లేద‌ని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.

ఇదిలా ఉండ‌గా త‌న త‌ల్లి హీరా బెన్ గురించి భావోద్వేగంతో క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా త‌న దుఃఖ్ఖాన్ని పంచుకున్నారు. మాలో నిరంత‌రం స్పూర్తి నింపింది మా అమ్మ హీరా బెన్. నిస్వార్థ క‌ర్మ యోగి.

విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండే జీవితాన్ని గ‌డిపింద‌న్నారు . ఆమె దేవుడి చెంత‌కు చేరింది. ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని పేర్కొన్నారు మోదీ. త‌న‌తో పోల్చితే త‌న త‌ల్లి బాల్యం నుంచి చాలా క‌ష్టాలు ఎదుర్కొంద‌ని తెలిపారు. ఇంటి ఖ‌ర్చులకు సాయం చేసేందుకు అమ్మ ఇళ్ల‌ల్లో పాత్ర‌లు క‌డిగే వార‌ని గుర్తు చేసుకున్నారు.

Also Read : త‌ల్లికి త‌న‌యుడి తుది వీడ్కోలు

Leave A Reply

Your Email Id will not be published!