HMDA Super : హెచ్ఎండీఏ పనితీరు అద్భుతం
ప్రశంసలు కురిపించిన మంత్రి కేటీఆర్
HMDA Super : హైదరాబాద్ నగర పాలక సంస్థ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. భాగ్యనగరం భవిష్యత్తును సిద్దం చేసేందుకు సన్నద్దం కావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఉత్తర హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు ఇప్పుడు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని వెల్లడించారు.
ఇదే సమయంలో తాను వ్యక్తిగతంగా నగర భవిష్యత్తు బాగుండాలని కోరుతూ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని కోరానని తెలిపారు కేటీఆర్(KTR). తమ నాయకుడు, భారత రాష్ట్ర సమితి పార్టీ చీఫ్ , సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీని కలిసి అభ్యర్థించారని వెల్లడించారు కేటీఆర్.
అంతే కాకుండా నగరంలో స్కైవేల నిర్మాణం కోసం 150 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించిన భూమిని అప్పగించాలని కోరారని పేర్కొన్నారు. గత 7 ఏళ్లలో 5 మంది కేంద్ర రక్షణ శాఖ మంత్రులతో వ్యక్తిగతంగా వినతిపత్రాలు సమర్పించారని తెలిపారు. ఇందులో దివంగత అరుణ్ జైట్లీ , సుష్మా స్వరాజ్ లతో పాటు ప్రస్తుతం కొలువు తీరిన నిర్మలా సీతారామన్ , రాజ్నాథ్ సింగ్ కు కూడా వినతిపత్రాలు ఇచ్చామన్నారు. కానీ నిధులు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు.
Also Read : Bose Raju Revanth Reddy : రేవంత్ రెడ్డితో బోస్ రాజు భేటీ