BC Nagesh : మెరుగైన తీర్పును ఆశిస్తున్నాం – న‌గేష్

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మంత్రి

BC Nagesh : క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం నిషేధం విధించిన హిజాబ్ వివాదంపై గురువారం సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసింది. త‌దుప‌రి తుది తీర్పును వెలువ‌రించే బాధ్య‌త‌ను ఇద్ద‌రు స‌భ్యుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ యుయు లలిత్ కు అప్ప‌గిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

దీంతో దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన ఈ హిజాబ్ వివాదం మ‌రింత ఆల‌స్యం జ‌ర‌గ‌నుంది. దీనిపై తీవ్రంగా స్పందించారు క‌ర్ణాట‌క విద్యా శాఖ మంత్రి బిసి న‌గేష్(BC Nagesh)  . ఇంత కంటే మ‌రింత మెరుగైన తీర్పు వ‌స్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. గురువారం విద్యా శాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు.

ప్ర‌భుత్వం మేలు కోరి ముంద‌స్తుగా ప్ర‌క‌ట‌న జారీ చేసింద‌న్నారు. ఎవ‌రైనా స‌రే ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉండాల్సిందేనంటూ స్ప‌ష్టం చేశారు. ఒక‌రికి ఒక రూల్ ఇంకొక‌రికి మ‌రో రూల్ ఉండ‌ద‌న్నారు బిసి న‌గేష్(BC Nagesh) . దీనిని తాము ఒప్పుకోబోమ‌న్నారు. ఎవ‌రి మత విశ్వాసాలు వారివి.

కాద‌నం కానీ విద్యా సంస్థ‌ల్లోకి వ‌చ్చే స‌రిక‌ల్లా ఆయా సంస్థ‌లు ప్ర‌భుత్వానికి లోబ‌డి న‌డుస్తుంటాయి. వాటినే అమ‌లు చేయాల్సిందేనంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు. భిన్న‌మైన తీర్పు వ‌చ్చినా తుది తీర్పు ఇంకా రాలేద‌ని పేర్కొన్నారు బిసి న‌గేష్ .

ఇదిలా ఉండగా ఫిబ్ర‌వ‌రి 5న క‌ర్ణాట‌క స‌ర్కార్ జారీ చేసిన ఆదేశాల‌పై ఒక వ‌ర్గానికి చెందిన వారంతా పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌ల‌కు దిగారు. ఈ హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది.

ఇవాళ సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం తుది తీర్పును వెలువ‌రించే బాధ్య‌త‌ను భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌మూర్తికి బ‌దిలీ చేసింది.

Also Read : హిజాబ్ వివాదం ఇక సీజేఐ ముందుకు

Leave A Reply

Your Email Id will not be published!