Shashi Tharoor : శత్రుత్వం హిందూ మార్గం కాదు – థరూర్
మతం పోకడపై కాంగ్రెస్ నేత కామెంట్స్
Shashi Tharoor : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతరుల పట్ల శత్రుత్వం అన్నది హిందూ మార్గం కాదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హిందుత్వం పేరుతో ప్రజలు తమ విశ్వాసాన్ని ఆయుధాలుగా మార్చు కోవడం , ఇతరుల పట్ల శత్రుత్వం, దూకుడుగా వ్యవహరించడం చూసి తాను విస్తు పోయానని అన్నారు.
అయితే స్వామి వివేకానంద హిందూ మతం అందరినీ కలుపుకుని పోయిందని చెప్పారు శశి థరూర్(Shashi Tharoor) . కాగా తనకు ఇష్టమైన హిందూ ఐకాన్ మాత్రం వివేకానందుడేనని పేర్కొన్నారు. హిందూ మతంపై రెండు పుస్తకాలు రాసిన రచయితగా మారిన రాజకీయవేత్త కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
చాలా మంది మితవాద రాజకీయ నాయకులు స్వామి వివేకానందను అతని సందేశంతో కూడిన సంపూర్ణతను విస్మరిస్తూ సెలెక్టివ్ గా కోట్ చేయడం వరకే పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు శశి థరూర్. భారతీయ జనతా పార్టీ లోని కొందరు స్వామి వివేకానందను ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నట్లు చూపేందుకు ఎంపిక చేసుకుంటున్నారని అన్నారు.
కానీ ఆయన ఇచ్చిన సందేశాన్ని పూర్తిగా చదివిన లేదా ఆకళింపు చేసుకున్నా అందరినీ కలుపుకుని పోవాలని చెప్పినట్లు అర్థం చేసుకుని ఉండే వారన్నారు. ఇదిలా ఉండగా రామకృష్ణ మిషన్ ను స్థాపించారు స్వామి వివేకానంద. ఆయన 160వ జయంతి ఈ ఏడాది ప్రారంభంలో జరిగింది.
ఏపీజే కోల్ కతా లిటరరీ ఫెస్టివల్ లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంతకు ముందు శశి థరూర్(Shashi Tharoor) ప్రసంగించారు.
Also Read : బీజేపీ..కాంగ్రెస్ ఒక్కటే – అఖిలేష్ యాదవ్