PM Modi : దేశాన్ని దోచుకున్న వాళ్లు విమర్శిస్తే ఎలా – మోదీ
కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన ప్రధాని
PM Modi : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. శుక్రవారం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ డిసెంబర్ 5న జరగనున్న బనస్కాంత జిల్లా లోని కాంక్రరేజ్ గ్రామంలో మోదీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి ప్రసంగించారు.
కాంగ్రెస్ అంటే అత్కానా..లత్కానా..ఔర్ భత్కానా అన్నారు. అంటే అర్థం నిలిపి వేయడం..ఆలస్యం చేయడం..తప్పు పట్టించడం మాత్రమే అని ఆరోపించారు. ఇన్నేళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలో ఏం మిగిల్చారంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం దేశాన్ని దోచుకున్న వాళ్లు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక అక్రమార్కుల ఆట కట్టించామని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ(PM Modi). దేశం ప్రగతి పథంలో పయనిస్తుంటే లేని పోని ఆరోపణలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. గుజరాత్ లో సరోవర్ డ్యామ్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందంటూ ప్రధానమంత్రి ఆరోపించారు.
అవినీతిని అంతం చేసే పనిలో తాను ఉన్నానని అన్నారు. కానీ ప్రతి విషయంలో , ప్రతి నిర్ణయంలో తనకు అడ్డు చెప్పేందుకు వస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు మోదీ. గుజరాత్ లో ఎండి పోయిన ప్రాంతాలకు నర్మదా నదీ జలాలను తీసుకు రావడానికి కాంగ్రెస్ ఏనాడూ ప్రయత్నించిన పాపాన పోలేదన్నారు.
అవినీతికి ఆస్కారం ఉన్న చోటనే ఆ పార్టీ పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపించిందని విమర్శించారు ప్రధానమంత్రి. నరేంద్ర మోదీ మరోసారి నర్మదా బచావో ఆందోళన్ కార్యకర్త మేధా పాట్కర్ పై నిప్పులు చెరిగారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందన్నారు.
Also Read : బీజేపీ స్పోక్స్ పర్సన్ గా జైవీర్ షెర్గిల్