Supreme Court Demonetisation : నోట్ల రద్దు రికార్డులు లేవంటే ఎలా – సుప్రీం కోర్టు
కేంద్ర సర్కార్ ..ఆర్బీఐపై సీరియస్
Supreme Court Demonetisation : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఇప్పటికీ ఇబ్బందులు కలుగ చేస్తోంది. ఎవరికీ చెప్పా చేయకుండా అర్ధరాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. ఆ తర్వాత కరోనా మహమ్మారి కంటే ఎక్కువ ఇబ్బందులకు గురయ్యారు సాధారణ జనం. బడా బాబులు, వ్యాపారవేత్తలు, ఆర్థిక నేరగాళ్లు, హవాలా మార్కెట్ వ్యక్తులు, కార్పొరేట్లు, కంపెనీలు ముందస్తుగా సర్దుకున్నాయి.
ఇంకొందరు పెద్ద ఎత్తున బంగారం, రియల్ ఎస్టేట్ లో పెద్ద ఎత్తున స్థిర, చరాస్థులను కొనుగోలు చేశారు. కానీ ఈరోజు వరకు నోట్ల రద్దుకు సంబంధించి ఎన్ని నోట్లు రద్దు చేశారు. ఇంకా చలామణిలో ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పటి వరకు వివరాలు దేశ ప్రజలకు తెలియ చేయలేదు కేంద్ర సర్కార్.
దీనిని నియంత్రస్తూ వస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మౌనంగా ఉండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నోట్ల రద్దుకు సంబంధించిన వివరాలు ఎందుకు ప్రకటించడం లేదంటూ సుప్రీంకోర్టులో(Supreme Court Demonetisation) 58 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటిపై బుధవారం ధర్మాసనం విచారణ చేపట్టింది.
నవంబర్ 8, 2016న ప్రధానమంత్రి నోట్ల రద్దు ప్రకటించడాన్ని సవాల్ చేశాయి ఈ దావాలన్నీ. దీనిపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక రకంగా హెచ్చరించింది. వెంటనే నోట్ల రద్దుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రికార్డులను తమకు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది.
డిసెంబర్ 10 లోగా లిఖిత పూర్వ వాదనలు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఆర్థిక విధాన పరమైన అంశాల్లో న్యాయ సమీక్ష పరిమిత పరిధి అంటే కోర్టు చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదని పేర్కొంది. కానీ సర్కార్ నిర్ణయం తీసుకునే విధానాన్ని ఎల్లప్పుడూ పరిశీలించే అధికారం తమకు ఉందని ఫైర్ అయ్యింది.
Also Read : పీఎం సహకారం అవసరం – కేజ్రీవాల్