Arvind Kejriwal : మోదీ సామాన్యులను అవమానిస్తే ఎలా
నిప్పులు చెరిగిన అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ కామెంట్స్ చేశారు. సామాన్యులను చులకనగా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించే మోదీ ఈ రకమైన ప్రవృత్తి కలిగి ఉంటారని తాను ఏనాడూ అనుకోలేదని అన్నారు.
ప్రస్తుతం మోదీ ఫ్రస్టేషన్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు. గుజరాత్ లో తన కోట కూలి పోతోందని ఆందోళన చెందుతున్నారని అన్నారు సీఎం. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల షెడ్యూల్ డిక్లేర్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కానీ గుజరాత్ లో ప్రకటించాల్సి ఉండగా ఇంకా డిక్లేర్ చేయలేదు.
ఆప్ కు రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక పోతోందని, బీజేపీకి భయం పట్టుకుందని షాకింగ్ కామెంట్స్ చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఆదివారం తన అధికారిక ట్విట్టర్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రధాన మంత్రి మోదీని టార్గెట్ చేస్తూ పై విధంగా పేర్కొన్నారు.
సామాన్యులు కూడా మనుషులేనని వారు కూడా ఈ దేశంలో భాగమని గుర్తించక పోవడం దారుణమన్నారు. వారు లేకుండా ఈ దేశం లేదన్నారు ఢిల్లీ సీఎం. రాజకీయంగా తాను బలవంతుడినన్న అహంకారంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపించారు.
ద్రవ్యోల్బణం కారణంగా ఆందోళన చెందుతున్న ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందించడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు అరవింద్ కేజ్రీవాల్. ఆయన దిగజారుతనం ఏమిటో దీని ద్వారా తెలుస్తుందన్నారు. ఇప్పటికైనా సామాన్యుల పట్ల తన అభిప్రాయాన్ని మార్చు కోవాలని సూచించారు సీఎం పీఎంకు.
Also Read : దర్గాను దర్శించిన ఆర్ఎస్ఎస్ నేత