HP Sandesh : ఏసీబీపై సీరియస్ జడ్జికి వార్నింగ్
కర్ణాటకలో జస్టిస్ హెచ్ పి సందేశ్ కలకలం
HP Sandesh : ఈ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉంది అనడానికి ఈ న్యాయమూర్తే నిదర్శనం. ఓ వైపు ద్వేషం, మతం, కులం, ప్రాంతీయ వాదం, అశ్రిత పక్షపాతం, అవినీతి, అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.
ఎంత సంపాదిస్తే అంత గొప్పోడు అన్నంత స్థాయికి సమాజం దిగజారింది. ఈ తరుణంలో సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షేనన్న దానిని సీజేఐగా ఎన్వీ రమణ కొలువు తీరాక తుడిచి పారేశారు.
న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో తాజాగా కర్ణాటకలో చోటు చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
విషయానికి వస్తే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్ పి సందేశ్(HP Sandesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏకంగా రాష్ట్రంలో అవినీతి, అక్రమాలను నిరోధించాల్సిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏసీబీ అన్నది కలెక్షన్ సెంటర్ గా మారందని మండిపడ్డారు. కరప్షన్ ను కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సంస్థ చివరకు అదే అవినీతికి కేరాఫ్ గా మారడం దారుణమన్నారు.
ఇలా ఆరోపణలు చేయడం వల్ల తనకు బదిలీ చేస్తానంటూ బెదిరింపులు కూడా వచ్చినట్లు చెప్పారు జడ్జి హెచ్ పి సందేష్. రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజా శ్రేయస్సు కోసం తాను దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు.
2021 మేలో రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ అరెస్ట్ అయిన బెంగళూరు అర్బన్ కలెక్టరేట్ లోని డిప్యూటీ తహశిల్దార్ పీఎస్ మహేష్ బెయిల్ పిటిషన్ సమర్పించారు.
ఈ విచారణ సందర్భంగా జస్టిస్ హెచ్ పీ సందేశ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రైతు కొడుకును. ఎలా బతకాలో తెలుసు. రూ. 50తో జీవించ గలను. రూ. 50 వేలతో సర్దు కోగలనని కామెంట్ చేశారు.
Also Read : న్యాయమూర్తులపై సీజేఐకి లేఖాస్త్రం