Medaram Jatara : ఆసియా ఖండంలోనే అతి పెద్ద మహా కుంభ మేళా మేడారం లక్షలాది భక్తులతో అలరారుతోంది. ఎక్కడ చూసినా సమ్మక్క సారలమ్మ(Medaram Jatara) నామ స్మరణతో మారు మ్రోగుతోంది.
శివసత్తుల పూనకాలు, భక్తుల విన్యాసాలతో దద్దరిల్లుతోంది. సమ్మక్క, సారలమ్మ, పగడిగిద్దరాజు, గోవింద రాజు..వన దేవతలు గద్దెలపై కొలువు తీరడంతో భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
చీరలు, రవిక ముక్కలు, ఎత్తు బంగారం , ఎదురు కోళ్లు, ఒడి బియ్యం, కొబ్బరి కాయలతో భక్తులు తండోప తండాలుగా మొక్కులు సమర్పించుకున్నారు. ఇక అమ్మ వారి నుంచి అందించే ప్రసాదం , పసుపు, కుంకుమ కోసం భక్త జనం పోటీ పడ్డారు.
ఇక జంపన్న వాగు జనసంద్రమై పోయింది. తెలుగు రాష్ట్రాలే కాదు దేశం నలుమూలల నుంచి ఆదివాసీలు భారీ ఎత్తున మేడారంకు తరలి వచ్చారు. ఇప్పటి వరకు కోటి 10 లక్షలకు పైగా వన దేవతలను దర్శించుకున్నట్లు అంచనా.
ఈ ఆదివాసీ ఉత్సవం అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతోంది. ఈనెల 16న మొదలైన మేడారం జాతర ప్రారంభమైంది. మేడారం చుట్టు పక్కల ఇంకా ట్రాఫిక్ జామ్ కొనసాగుతూనే ఉంది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ఇప్పటికే 3 వేల 845 బస్సులను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర, ఒడిశా, మధ్య ప్రదేశ్ , ఏపీ, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి ఆదివాసీ గిరిజనులు తరలి రావడం విశేషం.
ప్రముఖులు కూడా ఇక్కడికి విచ్చేశారు. ఇవాళ ఆఖరి రోజు మొత్తం నాలుగు రోజుల పాటు కొనసాగింది. ఇవాళ నలుగురు దేవతలు వనంలోకి వెళ్లి పోతారు. 18న వస్తారని అనుకున్న సీఎం కేసీఆర్ పర్యటన రద్దయింది.
Also Read : రవిదాస్ ఆలయంలో రాహుల్ సేవ