Rahul Gandhi Yatra : రాహుల్ జోడో యాత్రకు జనం జేజేలు
అడుగడుగునా జనం బ్రహ్మరథం
Rahul Gandhi Yatra : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Rahul Gandhi Yatra) తెలంగాణలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 57 రోజులు పూర్తయ్యాయి. ప్రస్తుతం సంగారెడ్డిలోకి చేరుకుంది పాదయాత్ర. రాహుల్ గాంధీకి అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు. నవంబర్ 4 శుక్రవారం ఒక రోజు యాత్రకు విరామం ఉంటుంది.
తిరిగి 5న భారత్ జోడో యాత్రను ప్రారంభిస్తారు. రాహుల్ గాంధీ వెంట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీ చందర్ రెడ్డి పాల్గొన్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభించారు రాహుల్ గాంధీ పాదయాత్రను. అక్కడి నుంచి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో భారత్ జోడో యాత్ర పూర్తయింది.
ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలో బహిరంగ సభలో ప్రసంగించారు. నవంబర్ 7న మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి మధ్య ప్రదేశ్ కు చేరుకుంటుంది. ఇక రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం కలిగేలా చేస్తోంది.
మరో వైపు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలో పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అస్సాంలో కూడా జోడో యాత్రను స్టార్ట్ చేసింది. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ ఎక్కడా తగ్గడం లేదు. ఎక్కడా నోరు జారడం లేదు. అనుభవం కలిగిన నాయకుడిగా సమస్యలపై స్పందించడం విస్తు పోయేలా చేస్తోంది.
రాహుల్ యాత్రతో బీజేపీ పునరాలోచనలో పడింది. మొత్తంగా రాహుల్ గాంధీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
Also Read : భారత్ జోడో యాత్రలో నా ఫోటో వద్దు