Munugodu By Poll : బందూకులు..ఖాకీల నీడన మునుగోడు
ముగిసిన ఎన్నికల ప్రచారం..రేపే పోలింగ్
Munugodu By Poll : దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. మొత్తం 2 లక్షల 41 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. నవంబర్ 3 గురువారం పోలింగ్ జరగనుంది.
మొత్తం 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. ఇదే సమయంలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద(Munugodu By Poll) వెబ్ కాస్ట్ తో అనుసంధానం చేసింది. ఇక ప్రధాన పోటీదారుగా భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ వర్గాల మధ్య దాడులు చేసుకున్నారు. పరిస్థితి దారుణంగా ఉండడంతో స్వయంగా రంగంలోకి దిగారు ఎస్పీ రెమా రాజేశ్వరి.
ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏకంగా రిటర్నింగ్ ఆఫీసర్ ను బదిలీ చేసింది. భారీ ఎత్తున రిగ్గింగ్ , ఇతర సంఘటనలు జరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు రావడంతో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. పోలింగ్ కోసం 3 వేల మంది పోలీసులు, 20 కేంద్ర బలగాలు మోహరించాయి.
భారీ భద్రతను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంతే కాకుండా మద్యం, డబ్బుల పంపిణీ జరగకుండా ఉండేందుకు 50 ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేసింది ఈసీ. మొత్తం 100 చెక్ పోస్టులు ఉన్నాయి.
పోలింగ్ సందర్భంగా 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించింది ఈసీ. ప్రధాన పార్టీలన్నీ గెలుపే ధ్యేయంగా పని చేశాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలతో మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేశాయి. ఇక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.
Also Read : మునుగోడులో మునిగేది ఎవరో