NIT Warangal : వరంగల్ నిట్ స్టూడెంట్ కు భారీ ప్యాకేజీ
నిట్ చరిత్రలో భారీ వేతనంతో రికార్డు
NIT Warangal : టాలెంట్ ఉంటే చాలు జాబ్స్ అవంతట అవే వస్తాయి. కావాల్సందల్లా చదువు కోవాలన్న పట్టుదల. ఓ వైపు ఆర్థిక మాంద్యం దెబ్బకు ఉన్న కొలువులు ఊడి పోతున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ , మెటా, గూగుల్ , సిస్కో, అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలన్నీ ఉద్యోగాలు ఊడగొడుతున్నాయి.
ఈ తరుణంలో భారతీయ విద్యార్థులకు మాత్రం బంపర్ ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్ , త్రిబుల్ ఐటీ హైదరాబాద్ కు చెందిన పలువురు విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లలో సత్తా చాటారు. భారీ ప్యాకేజీలు అందుకున్నారు.
కానీ తాజాగా తెలంగాణలోని వరంగల్(NIT Warangal) లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)కు చెందిన ఆదిత్యా సింగ్ ఏకంగా ఏడాదికి రూ. 88 లక్షల ప్యాకేజీకి ఎంపికయ్యాడు. వరంగల్ నిట్ చరిత్రలో ఇది ఓ రికార్డుగా పరిగణించవచ్చు. ఇదే విషయాన్ని వరంగల్ నిట్ కూడా ధ్రువీకరించింది.
పలు ఐఐటీల్లో సత్తా ఉన్న వాళ్ల కోసం కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉండగా వరంగల్ నిట్ కు చెందిన కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఆదిత్య సింగ్ కు భారీ ఆఫర్ ఇచ్చింది ఓ కంపెనీ. ఈ నిట్ లో ఇదే అత్యధిక ప్యాకేజ్ కావడం విశేషం. హైదరాబాద్ ను కూడా దాటేశాడు ఈ స్టూడెంట్.
ఐఐటీ హైదరాబాలో ఎలక్ట్రికల్ చదువుతున్న ఎంటెక్ విద్యార్థికి రూ. 63.8 లక్షల ప్యాకేజీ తో రికార్డు సాధించగా దానిని వరంగల్ నిట్ ఆదిత్య సింగ్ దాటేశాడు. సో ఐఐటీలా మజాకా అంటున్నారు స్టూడెంట్స్.
Also Read : ఏడాదిన్నరలో లక్షన్నర కొలువులు – కేటీఆర్