APSRTC MD : ఏపీఎస్ఆర్టీసీకి కాసుల పంట

సంక్రాంతి పండుగ వేళ

APSRTC MD : అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల రోడ్డు ర‌వాణా సంస్థ‌లు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీల‌కు కొత్త ఏడాది 2023 భారీగా ఆదాయం స‌మ‌కూరింది. కోట్ల రూపాయ‌ల ఆదాయం ల‌భించింది. సంక్రాంతి పండుగ‌కు భారీ ఎత్తున జ‌నం ప్ర‌యాణం చేశారు. దీంతో ఊహించ‌ని రీతిలో ఏపీఎస్ఆర్టీసికి భారీ ప్రాఫిట్ స‌మ‌కూర‌డం విస్తు పోయేలా చేసింది.

పెద్ద పండుగ‌కు భారీగా ప్ర‌యాణం చేశారు. బ‌స్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగింది. ఫెస్టివ‌ల్ కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది సంక్రాంతికి ఏకంగా రూ. 141 కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. ఈ విష‌యాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ద్వారకా తిరుమ‌ల‌రావు(APSRTC MD) వెల్ల‌డించారు.

జ‌న‌వ‌రి 6వ తేదీ నుంచి 14వ తేదీ వ‌ర‌కు రికార్డు స్థాయిలో 3,392 బ‌స్సుల‌ను న‌డిపిన‌ట్లు చెప్పారు. గ‌తానికంటే భిన్నంగా ఈసారి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు. ఈసారి పండుగ సంద‌ర్భంగా అద‌నపు ఛార్జీలు పెంచ‌లేద‌ని పేర్కొన్నారు. సాధార‌ణ ఛార్జీల‌ను మాత్ర‌మే వ‌సూలు చేశామ‌ని, దీంతో ప్ర‌యాణీకులు పెద్ద ఎత్తున ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణం చేశార‌ని స్ప‌ష్టం చేశారు ద్వారకా తిరుమ‌ల్ రావు.

అంతే కాకుండా ఈసారి మ‌రీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు ఎండీ. అదేమిటంటే రాను, పోను టికెట్లు బుక్ చేసుకున్న వారికి టికెట్ ఛార్జీల‌పై 10 శాతం రాయితీ కూడా ఇచ్చామ‌ని దీని వ‌ల్ల భారీ ఎత్తున ప్ర‌యాణీకులు జ‌ర్నీ చేశారంటూ చెప్పారు. మొత్తం 1.21 కోట్ల మంది బ‌స్సుల్లో ప్ర‌యాణం చేశార‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : ప‌వ‌న్ జాన్తా నై పోటీకి సై – అలీ

Leave A Reply

Your Email Id will not be published!