Tirumala Rush : పోటెత్తిన భక్తులతో తిరుమల కిటకిట
ఆదివారం 87 వేల 762 మంది దర్శనం
Tirumala Rush : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలుమంగమ్మ కొలువై ఉన్న పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల భక్తులతో కిట కిట లాడుతోంది. భారీ ఎత్తున తరలి వచ్చారు. ఎక్కడ చూసినా భక్తులే కనిపించారు. గోవిందా గోవిందా ఆపద మొక్కుల వాడా గోవిందా, శ్రీనివాసా గోవిందా, అనాధ రక్షకా గోవిందా, అదిగో శ్రీహరి వాసము, పది వేల శేషుల పడుగల మయం అంటూ సంకీర్తనలతో హోరెత్తి పోయింది తిరుమల.
వేసవి సెలవులు ముగిసినా ఇంకా భక్తులు తరలి వస్తూనే ఉన్నారు(Tirumala Rush) స్వామి వారి దర్శనం కోసం. గత ఆదివారం 92 వేలకు పైగా భక్తులు శ్రీనివాసుడిని, అమ్మ వారిని దర్శించుకుంటే జూన్ 17న ఏకంగా ఆ సంఖ్య 72 వేలను దాటి 87 వేలకు పైగా చేరుకుంది. శనివారం స్వామి, అమ్మ వార్లను మొత్తం 87 వేల 762 మంది దర్శించుకున్నారు.
స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 43 వేల 753గా ఉంది. ఇక స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.61 కోట్లు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. మరో వైపు స్వామి వారి దర్శనానికి సంబంధించి ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న వారి భక్తులు ఆయా కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. కనీసం వీరికి దర్శన సమయం 24 గంటలు పట్టే అవకాశం ఉందని టీటీడీ వెల్లడించింది.
Also Read : Pawan Kalyan : వైసీపీని అడ్రస్ లేకుండా చేయాలి