Tirumala Tirupati Devasthanams: తిరుమలలో భక్తుల రద్ధీ ! వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు !

తిరుమలలో భక్తుల రద్ధీ ! వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు !

Tirumala Tirupati Devasthanams: వేసవి సెలవులు ముఖ్యంగా ఎన్నికల పోలింగ్ పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ముఖ్యంగా, శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ వలన… వారి దర్శనానికి సుమారు ౩౦- 40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా… జూన్‌ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాలలో బ్రేక్‌ దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని… భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు. భక్తులు కూడా రద్దీని గమనించి తిరుమల ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Tirumala Tirupati Devasthanams….

శనివారం తెల్లవారుజాము నుంచే తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కొండపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు అన్ని నిండిపోయి… ఏకంగా రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూ కట్టి ఉన్నారు. భక్తులు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనానికి 24 గంటలకుపైగా సమయం పడుతోందని టీటీడీ చెబుతోంది. టీటీడీ రద్దీని గమనిస్తూ… క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నారు.

Also Read : Telangana Formation Day: పరేడ్‌ గ్రౌండ్‌ లో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు !

Leave A Reply

Your Email Id will not be published!