Hyderabad Rains : చినుకు పడితే నగరం చిత్తడే
మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ ఫైర్
Hyderabad Rains : హైదరాబాద్ ను డల్లాస్ చేస్తానన్న సీఎం ఎక్కడున్నాడని ప్రశ్నించింది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్(Congress) కమిటీ. చిన్న చినుకులకే నగరం తల్లడిల్లి పోతోందని పేర్కొంది. గురువారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించి పలు ఫోటోలు షేర్ చేసింది. ట్విట్టర్ టిల్లు ఎక్కడున్నాడంటూ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి సెటైర్ వేసింది.
Hyderabad Rains Heavy
నగరంలో కేవలం 3 నుండి 4 సెంటీమీటర్ల వర్షం కురిసినా రోడ్లపైకి నీళ్లు వస్తున్నాయని, డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని ఆరోపించింది. సామాన్యుల పరిస్థితి దారుణంగా ఉంటే, ఇక వాహనదారుల పరిస్థితి ఘోరంగా తయారైందని వాపోయింది.
గత 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాజధానిని అన్ని రంగాలలో అభివృద్ది చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఇంతకూ తండ్రీ, కొడుకులు, కల్వకుంట్ల ఫ్యామిలీ బయటకు వస్తే తెలుస్తుందని స్పష్టం చేసింది.
అస్తవ్యస్తమైన పాలనకు, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి హైదరాబాద్ నిదర్శనగా నిలిచిందని పేర్కొంది టీపీసీసీ. మిరుమిట్లు గొలిపే లైట్లతో నానక్ రాం గూడ లేదా నార్సింగి మీదుగా డ్రోన్ షాట్ లు వేయడం అభివృద్ది కాదని స్పష్టం చేసింది. ఇలాంటి నాసిరకం పనులు చేయడం వల్లనే నగరాన్ని నీళ్లు ముంచెత్తుతున్నాయని హెచ్చరించింది.
Also Read : Daggubati Purandeswari : ఏపీ అప్పుల కుప్పపై ఫిర్యాదు