Hyderabad Ranked : సురక్షిత నగరాలలో హైదరాబాద్
ది క్రైమ్ ఇన్ తెలంగాణ పుస్తకం రిలీజ్
Hyderabad Ranked : హైదరాబాద్ – దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరాలలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ పట్టణానికి చోటు దక్కింది. ప్రతి ఏటా ర్యాంకులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా ప్రకటించిన జాబితాలో హైదరాబాద్ కు 3వ స్థానం దక్కింది.
Hyderabad Ranked For Good Place
ఇక సురక్షిత నగరాల పరంగా చూస్తే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా, మరాఠా రాజధాని పూణెలు వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాలను దక్కించుకున్నాయి. ప్రతి లక్ష జనాభాకు అతి తక్కువ సంఖ్యలో నేరాలు జరుగుతుండడం విశేషం.
అయితే ఇక హైదరాబాద్(Hyderabad) పరంగా చూస్తే భారీగా నేరాలకు అడ్డాగా మారడం ఒకింత విస్తు పోయేలా చేస్తోంది. 2021 సంవత్సరంతో పోలిస్తే 2022వ సంవత్సరంలో తెలంగాణలో సైబర్ నేరాలు భారీ ఎత్తున పెరిగాయి. 48.47 శాతంగా ఉన్నాయి. ఆర్థఙక నేరాలు 41.37 శాతం పెరుగగా, మోసంతో కూడిన నేరాలు 43.30 శాతం, ఆస్తులు, ఆర్థిక నేరాలు కూడా అదే రీతిన పెరగడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణ డీజీపీ రవి గుప్తా పర్యవేక్షణలో ది క్రైమ్ ఇన్ తెలంగాణ -2022 పుస్తకాన్ని విడుదల చేశారు. ఇందులో పూర్తి వివరాలను పొందు పరిచారు. ఈ సందర్బంగా మంగళవారం డీజీపీ రవి గుప్తా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Also Read : IPL Auction 2024 : 77 మంది ఆటగాళ్లు రూ. 262 కోట్లు