PM Modi : హైడ్రో పవర్ స్టేషన్ జాతికి అంకితం – మోదీ
అరుణాచల్ ప్రదేశలో ఎయిర్ పోర్టు ప్రారంభం
PM Modi : ఈశాన్య భారతంలోని అరుణాల్ ప్రదేశ్ లో కొత్తగా నిర్మించిన ఎయిర్ పోర్టును శనివారం ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇక్కడి నుంచి గంటకు 200 మంది ప్రయాణీకులను చేరవేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. రాష్ట్రంలో తొలి గ్రీన్ ఫీల్డ ఎయిర్ పోర్ట్ ను ఇటానగర్ లోని డోనీ పోల్ లో నిర్మించారు.
ఇవాళ 600 మెగావాట్ల కమెంగో హైడ్రో పవర్ స్టేషన్ ను జాతికి అంకితం చేశారు. ఈ కొత్తగా ప్రారంభమైన ఎయిర్ పోర్ట్ తో మొత్తం ఈశాన్య బారత దేశంలో ప్రస్తుతం 16 ఎయిర్ పోర్టులు ఉన్నాయి. ఎనిమిది రాష్ట్ర రాజధానులలో ఎయిర్ పోర్టులు కొలువు తీరాయి.
ఇదిలా ఉండగా దేశంలోనే ఇదే మొదటి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు కూడా. దీనిని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఏర్పాటు చేసిన ఉడాన్ పథకం ద్వారా ఎయిర్ పోర్టు ను నిర్మించారు. ఇటానగర్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందులు తొలగి పోయాయి ఈకొత్త విమానాశ్రయం ప్రారంభంతో.
దీంతో పాటు మరో రెండు నగరాలు పాసిఘాట్ , తేజు ఉడాన్ స్కీం కు అనుసంధానం చేశారు. డోనీ పోలో ఎయిర్ పోర్టును 600 ఎకరాల విస్తీర్ణంలో రూ. 640 కోట్లకు పైగా ఖర్చు చేసి అభివృద్ది చేపట్టారు. దీనిని గత ఫిబ్రవరి 2019లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) శంకుస్థాపన చేశారు.
మూడేళ్ల తర్వాత దీనిని ప్రారంభించడం పీఎం ప్రారంభించడం విశేషం. ఈ ఎయిర్ పోర్టులో టెర్మినల్ తో పాటు ఆధునిక భవనం, పునరుత్పాదక శక్తి, వనరుల రీసైక్లింగ్ ను ప్రోత్సహిస్తోంది.
Also Read : అరుణాచల్ ప్రదేశ్ లో ఎయిర్ పోర్ట్ రెడీ