Rahul Gandhi BJP : బీజేపీని చూసి నేర్చుకుంటున్నా – రాహుల్
షాకింగ్ కామెంట్స్ చేసిన అగ్ర నాయకుడు
Rahul Gandhi BJP : దేశంలో రాజకీయ ఎన్నికల వాతావరణం మరింత వేడిని రాజేస్తోంది. మాటల యుద్దం మళ్లీ మొదలైంది. నిన్నటి దాకా తనను పప్పు అని పిలిచిన వారిని చూసి నవ్వుకున్న కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఉన్నట్టుండి ఊహించని రీతిలో షాక్ ఇస్తున్నారు. తనను విమర్శించే వాళ్లకు కోలుకోలేని రీతిలో సమాధానం ఇస్తూ పరేషాన్ చేస్తున్నారు.
ఆయన ఈ ఏడాది సెప్టెంబర్ 6న దేశానికి ద్వేషం వద్దు ప్రేమ కావాలనే నినాదంతో భారత్ జోడో యాత్రను చేపట్టారు. తొమ్మిది రాష్ట్రాలు పూర్తయ్యాయి. ఇప్పటికే 2,800 కిలోమీటర్లకు పైగా యాత్ర నిర్వహించారు. జనవరి 3 నుంచి యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. మొత్తం 150 రోజుల పాదయాత్ర.
ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రను మొదట లైట్ గా తీసుకుంది. కానీ రాను రాను రాహుల్ కు పెరుగుతున్న జనాదరణను చూసి విమర్శించడం మొదలు పెట్టింది. ఇక తనను కావాలని టార్గెట్ చేస్తూ వస్తున్న భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలు, నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) .
శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్వేషాలతో రాజకీయాలు చేస్తున్న కాషాయాన్ని చూసి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఎద్దేవా చేశారు. ఒక రకంగా బీజేపీని తాను గురువుగా భావిస్తున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. తన భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ ను ఆ పార్టీనే చూపిస్తోందని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
భారత్ జోడో యాత్ర ఏ ఒక్కరి కోసమో కాదు. ఎవరైనా రావచ్చు..తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయన్నారు.
Also Read : అఖిలేష్..మాయవతి ద్వేషాన్ని కోరుకోరు