Rahul Gandhi : నాయకుడిని కాను సామాన్యుడిని

స్పష్టం చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తాను నాయ‌కుడిని కాన‌ని కేవలం సాధార‌ణ మాన‌వుడిన‌ని స్ప‌ష్టం చేశారు. అమెరికా టూర్ లో భాగంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఎయిర్ పోర్ట్ లో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. త‌నకు ఎలాంటి భేష‌జాలు, అధికార యావ త‌న‌కు లేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా త‌న‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ప్ర‌యాణికులు ఎగ‌బ‌డ్డారు.

మోదీని విమ‌ర్శించిన కేసులో రాహుల్ గాంధీకి(Rahul Gandhi) సూర‌త్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయ‌న‌పై లోక్ స‌భ అన‌ర్హ‌త వేటు వేసింది. తాజాగా త‌న పాస్ పోర్టును స‌రెండ‌ర్ చేశారు. కోర్టును ఆశ్ర‌యించారు. రాహుల్ గాంధీకి పాస్ పోర్టు ఇచ్చేందుకు కోర్టు అనుమ‌తిచ్చింది. ప‌దేళ్ల పాటు కుద‌ర‌ని , కేవ‌లం మూడేళ్ల పాటు ఇచ్చేలా పాస్ పోర్టు ఇవ్వాల‌ని ఆదేశించారు న్యాయ‌మూర్తి.

ఎంపీ హోదా క‌లిగిన పాస్ పోర్ట్ కాకుండా కేవ‌లం సాధార‌ణ పౌరుడిగా తాను ఇక్క‌డికి వ‌చ్చిన‌ట్లు చెప్పారు రాహుల్ గాంధీ. ఇదిలా ఉండ‌గా ఎయిర్ పోర్ట్ లో రాహుల్ గాఃధీ చాలా సేపు వేచి ఉండాల్సి వ‌చ్చింది. ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ కాంగ్రెస్ చైర్ ప‌ర్స‌న్ శామ్ పిట్రోడా, ఐఓసీ ఇత‌ర ముఖ్య స‌భ్యులు స్వాగ‌తం ప‌లికారు.

ఇమ్మిగ్రేష‌న్ క్లియ‌రెన్స్ కోసం రాహుల్ గాంధీ రెండు గంట‌ల పాటు ఎయిర్ పోర్టులోనే ఉండి పోవాల్సి వ‌చ్చింది. క్యూలో ఎందుకు నిల్చున్నారంటూ ప్ర‌శ్నించిన మీడియాకు రాహుల్ గాంధీ తాను ఇప్పుడు నేత‌ను కాద‌న్నారు.

Also Read : Rakesh Tikait

Leave A Reply

Your Email Id will not be published!