Shashi Tharoor : నేను అసమ్మతి నాయకుడిని కాను – శశి థరూర్
పోటీ చేయడం ప్రజాస్వామ్యంలో సర్వ సాధారణం
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ అసమ్మతి నాయకుడిగా గుర్తింపు పొందారు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Shashi Tharoor). ఆయన కూడా పార్టీ చీఫ్ రేసులో ఉన్నారు.
ఇదే విషయాన్ని గతంలో కొంత కాలం నుంచీ ప్రకటిస్తూ వచ్చారు. ఇందుకు సంబంధించి పోటీ చేసే కంటే ముందు శశి థరూర్ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీని కలిశారు. తాను బరిలో ఉంటానని తమ సపోర్ట్ కావాలని కోరారు.
ఇదే సమయంలో ప్రస్తుతం 20 ఏళ్ల తర్వాత గాంధీ ఫ్యామిలీ కాకుండా జరుగుతోంది అధ్యక్ష పదవికి ఎన్నిక. గతంలో కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాగం కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే జి23 పేరుతో అసమ్మతి నాయకులంతా ఒక్కటై పలుమార్లు సమావేశమయ్యారు. ఇందులో కీలక పాత్ర పోషించారు కేంద్ర మాజీ మంత్రి, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad). ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీతో 50 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నారు.
ఈ జి23లో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చారు ఎంపీ శశి థరూర్. ఆయన అసమ్మతి వర్గం నుంచి పోటీలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నామినేషన్ వేసే కంటే ముందు రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీ, మాజీ పీఎం దివంగత రాజీవ్ గాంధీలకు నివాళులు అర్పించారు.
ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు శశి థరూర్. తాను జి23 టీంకు చెందిన నాయకుడిని కానే కాదని స్పష్టం చేశారు ఎంపీ. తన పోటీకి మేడం సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు.
Also Read : సీఎం పదవి కంటే పార్టీ ముఖ్యం – గెహ్లాట్