YS Sharmila : ఒట్టేసి చెబుతున్నా ఒంట‌రిగా పోరాడుతున్నా

స్ప‌ష్టం చేసిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల

YS Sharmila : తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. ప్రధానంగా దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న‌యురాలు వైఎస్ ష‌ర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ‌లో పాద‌యాత్ర చేప‌ట్టారు. 3,500 కిలోమీట‌ర్లు తిరిగారు. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు.

ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. అవినీతి, ఆరోప‌ణ‌ల‌ను ప్ర‌స్తావించారు. ఆపై మంత్రులు, ఎమ్మెల్యేల‌ను టార్గెట్ చేశారు. ఆపై సీఎం కేసీఆర్, కొడుకు కేటీఆర్, కూతురు క‌విత‌, అల్లుడు హ‌రీష్ రావును ఏకి పారేశారు. త‌న‌ను మ‌ర‌ద‌లా అని సంబంధించిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నీళ్ల నిరంజ‌న్ రెడ్డిని చెప్పుతో కొడ‌తాన‌ని అన్నారు.

ఆపై ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డికి మ‌గ‌తనం ఉందా అని ప్ర‌శ్నించారు. ఇదే విష‌యాన్ని ఆమె మ‌రోసారి ప్ర‌స్తావించారు. మ‌రో వైపు టీఆర్ఎస్ తో పాటు బీజేపీని, కాంగ్రెస్ పార్టీని విమ‌ర్శిస్తూ వ‌స్తున్న ష‌ర్మిల‌పై విప‌క్షాలు ఆమె బీజేపీ విడిచిన బాణం అంటున్నారు. ఇంకొంద‌రు ఆమె బీజేపీ బాణం కాద‌ని టీఆర్ఎస్ విడిచిన బాణం అంటున్నారు.

కాదు కాదు ఏపీ సీఎం జ‌గ‌న్ విడిచిన బాణం అని ఆరోపించారు. దీంతో శుక్ర‌వారం వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. నా తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మీద స‌త్య ప్ర‌మాణం చేసి చెబుతున్నా త‌న‌కు ఏ పార్టీతో సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు అలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్న వారు త‌న‌పై బుర‌ద చ‌ల్ల‌డం మాను కోవాల‌ని సూచించారు.

ప్ర‌స్తుతం ఆమె చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : కొడాలి నాని రాధా ములాఖ‌త్

Leave A Reply

Your Email Id will not be published!