కేరళ : తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేరళ రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తోందని, అయితే సీఎం ఎవరు అవుతారనే దానిపై స్పందించాడు. తాను కేరళ సీఎం రేసులో లేనని స్పష్ట చేశాడు. ఆదర్శంగా ఆ పదవి ఎన్నికైన ఎమ్మెల్యేకే దక్కాల్సిన అవసరం ఉందన్నాడు.140 మంది సభ్యులున్న కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు మెజారిటీ వస్తే సంతోషమేనని , అయితే 85-100 సీట్ల మధ్య వస్తే మంచిదని శశి థరూర్ అన్నారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తాను ఎన్నికలలో అభ్యర్థిని కానందున ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదనన్నాడు ఎంపీ. ముఖ్యమంత్రిని ఎన్నికైన ఎమ్మెల్యేల నుండే ఎన్నుకోవాలని తాను నమ్ముతున్నానని తెలిపాడు. పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో థరూర్ మాట్లాడాడు. తాను అభ్యర్థిని కానందున ఒక నిర్దిష్ట నియోజకవర్గం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. రాష్ట్ర ఎన్నికలలో తన పాత్ర “మిశ్రమంగా” ఉంటుందని పేర్కొన్నాడు. ప్రచారం కోసం “రాష్ట్ర నలుమూలలా పర్యటించడానికి” తాను ఎదురు చూస్తున్నానని ఆయన చెప్పాడు. ఇటీవల యూడీఎఫ్ నాయకులను ఉద్దేశించి కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీ ఇచ్చిన సలహాను కూడా థరూర్ ప్రస్తావించారు.
మెజారిటీ వస్తే తాను సంతోషిస్తానని, అయితే 140 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)కు 85-100 సీట్ల మధ్య సంఖ్య మంచిదని కూడా థరూర్ అన్నారు.
