Ashok Gehlot : తిరుగుబాటు ఎమ్మెల్యేల‌కు ద్రోహం చేయ‌లేను

రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచ‌ల‌న కామెంట్స్

Ashok Gehlot : రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇప్ప‌టికే ఆయ‌న కాంగ్రెస్ పార్టీ చీఫ్ పోస్ట్ కు పోటీ చేయాల్సి ఉంది. కానీ అనుకోని రీతిలో స్వంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. వారంతా సీఎం అశోక్ గెహ్లాట్ కు మ‌ద్ద‌తు ప‌లికారు.

ఇందులో త‌న త‌ప్పేమీ లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండగా పార్టీకి సంబంధించి ఒక నాయ‌కుడికి ఒకే ప‌ద‌వి అన్న‌ది పార్టీ తీర్మానం చేసింది. ఈ త‌రుణంలో ఒక‌వేళ పోటీ చేసి ఉంటే రాజ‌స్థాన్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసి ఉండాల్సి వ‌చ్చేది. ఇదే అదునుగా సీఎం ప‌ద‌వి కోసం అస‌మ్మ‌తి గ‌ళం వినిపిస్తూ వ‌చ్చిన స‌చిన్ పైల‌ట్ ప్ర‌య‌త్నం చేశారు.

దీనిని వ్య‌తిరేకిస్తూ పార్టీకి చెందిన 90 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మ‌డిగా రాజీనామా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీనిపై సీరియ‌స్ గా తీసుకుంది పార్టీ. అంతే కాదు పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త్వ‌ర‌లో రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఒక ర‌కంగా చేయి దాటి పోవ‌డంతో రంగంలోకి తానే స్వ‌యంగా దిగారు అశోక్ గెహ్లాట్(Ashok Gehlot). స్వ‌యంగా మేడంను నివాసంలో క‌లిసి త‌న‌ను మ‌న్నించ‌మ‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం రాజ‌కీయ సంక్షోభానికి తెర ప‌డినా చివ‌ర‌కు రాజ‌స్థాన్ సీఎంగా ఎవ‌రు ఉంటార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో సీఎం అశోక్ గెహ్లాట్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల‌కు తాను ద్రోహం చేయ‌లేన‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : గురుగ్రామ్ ఆస్ప‌త్రి ఐసీయూకి ములాయం

Leave A Reply

Your Email Id will not be published!