Bandi Sanjay : నాకు కేసులు..జైళ్లు కొత్త కాదు

కేసీఆర్ ప‌ని ఖ‌తం కౌంట్ డౌన్ స్టార్ట్

Bandi Sanjay : త‌న‌కు కేసులు, జైళ్లు కొత్త కాద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ స్టేట్ చీఫ్ , క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. రాష్ట్రంలో కేసీఆర్ పాల‌న‌కు డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందంటూ పేర్కొన్నారు. 317 జీవో ప్ర‌వేశ పెట్టిన సీఎం పై టీచ‌ర్లు క‌సి తీర్చుకున్నారంటూ ఆరోపించారు. త‌మ పార్టీ బ‌ల‌ప‌ర్చిన ఏవీఎన్ రెడ్డిని గెలిపించారంటూ వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని చెప్పారు బీజేపీ స్టేట్ చీఫ్‌.

పాల‌మూరు గ‌డ్డ సాక్షిగా బీజేపీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన నిరుద్యోగ భ‌రోసా స‌భ‌కు పెద్ద ఎత్తున నిరుద్యోగులు, విద్యార్థులు త‌ర‌లి వ‌చ్చారు. ప‌ట్ట‌ణ‌మంతా నిండి పోయింది. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు బండి సంజ‌య్ కుమార్. త‌న‌కు కేసులు , జైళ్లు కొత్త కాద‌న్నారు. తాను నిరుద్యోగుల కోసం కొట్లాడుతుంటే త‌న‌ను అక్ర‌మంగా జైలు పాలు చేశార‌ని ఆరోపించారు.

కేసీఆర్ పాల‌న‌లో రాష్ట్రం వెన‌క్కి వెళ్లింద‌ని, ప్ర‌తి ఒక్క‌రిపై అప్పుల మోత మోగుతోంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడితే త‌ప్పు ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు బండి సంజ‌య్ కుమార్. కేసీఆర్ అవినీతి, మూర్ఖ‌త్వ‌పు పాల‌న‌ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల కోసం ఎన్నిసార్లు అయినా స‌రే పోరాడుతాన‌ని, జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు.

Also Read : ఆటో న‌డిపిన మంత్రి కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!