Shashi Tharoor : గిరి గీసి చెబుతున్నా బరిలో ఉన్నా – థరూర్
అవన్నీ అబద్దమేనంటూ కామెంట్స్
Shashi Tharoor : కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో ఉన్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) షాకింగ్ కామెంట్స్ చేశారు. గాంధీ ఫ్యామిలీ నుంచి మల్లికార్జున్ ఖర్గే పోటీలో ఉండగా ఆయనకు పోటీగా శశి థరూర్ నిలిచారు. దీంతో ఇద్దరి మధ్య ఆసక్తికరమైన పోరు కొనసాగుతోంది. అక్టోబర్ 17న ఎన్నిక జరగనుండగా 19న ఫలితాలు ప్రకటిస్తారు.
ఇప్పటికే ఓ వైపు మల్లికార్జున్ ఖర్గే మరో వైపు శశి థరూర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మొత్తం 9,000 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. మల్లికార్జున్ ఖర్గే గుజరాత్ రాష్ట్రంలో బిజీగా ఉండగా శశి థరూర్(Shashi Tharoor) ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడులలో పర్యటించారు.
ఈ సందర్భంగా తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలను కొట్టి పారేశారు. అవన్నీ చేతకాని వారు చేసే వ్యతిరేక ప్రచారంగా కొట్టి పారేశారు. తాను బరాబర్ గా పోటీలో ఉన్నానని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. గిరి గీసి చెబుతున్నానని తాను తలవంచుకునే ప్రసక్తి లేదన్నారు శశి థరూర్.
శనివారం ఆయన స్వతహాగా సోషల్ మీడియా వేదికగా వీడియో సందేశం ఇచ్చారు. ఢిల్లీ మూలాల నుండి వచ్చిన పుకార్లపై స్పందించారు. ఇదంతా అబద్దపు ప్రచారంగా కొట్టి పారేశారు. తాను ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు శశి థరూర్.
అన్ని వర్గాల నుండి తనకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తన పోటీపై రాహుల్ గాంధీ కూడా ఓకే చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Also Read : అదానీ పెట్టుబడులను వ్యతిరేకిస్తాం