MLC Kavitha CBI : రూటు మార్చిన కవిత నేను ఫుల్ బిజీ
విచారణకు హాజరు కాలేనంటూ కామెంట్
MLC Kavitha CBI : కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి షాక్ ఇచ్చింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెకు ఇప్పటికే నోటీసు పంపింది. అంతే కాదు ఈనెల 6న మంగళవారం హాజరు కావాల్సిందిగా స్పష్టం చేసింది. హైదరాబాద్ లేదా ఢిల్లీలోని ఆఫీసుకు రావచ్చని కూడా వెసులుబాటు ఇచ్చింది.
ఈ తరుణంలో నోటీసు వచ్చిన వెంటనే కవిత(MLC Kavitha CBI) మాట్లాడారు. తాను ఎలాంటి విచారణకు సిద్దమేనని ప్రకటించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. ఎలా సీబీఐని రాకుండా చేయాలనే దానిపై పెద్ద ఎత్తున సమాలోచనలు జరిపారు. కాగా కేసు కవితపై తెలంగాణలో రిజిస్టర్ కాలేదు.
ఢిల్లీలో కేసు నమోదు కావడంతో సీబీఐ ఎక్కడి నుంచైనా రావచ్చని న్యాయ నిపుణులు సూచించారు. దీంతో ఉన్నట్టుండి సోమవారం రూట్ మార్చారు ఎమ్మెల్సీ కవిత. ఇందులో భాగంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన పేరు లేదని అందుకే తాను విచారణకు హాజరు కాలేనంటూ స్పష్టం చేశారు.
ఈ మేరకు సీబీఐ ఆఫీసర్ రాఘవేంద్ర వత్సకు లేఖ రాశారు. ముందే తనకు ప్రోగ్రామ్స్ ఉన్నాయని అందుకే తాను ఉండలేనంటూ పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే కవితనే ఫిటింగ్ పెట్టారు సీబీఐకి.
ఈనెల 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. పొలిటికల్ వ్యవహారాల్లో తాను ఫుల్ బిజీగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే తనకు చట్టం పట్ల గౌరవం ఉందని , తాను విచారణకు సహకారం అందిస్తానని తెలిపారు.
Also Read : సారు సర్ ప్రైజ్..! సీఎం బంపర్ ఆఫర్