Sabitha Indra Reddy : అపాయింట్​మెంట్​ ఇస్తే క‌లుస్తా – స‌బితా

గ‌వ‌ర్న‌ర్ ఆరోప‌ణ‌పై మాట మార్చిన మంత్రి

Sabitha Indra Reddy : త‌న‌కు గ‌వ‌ర్న‌ర్ నుంచి స‌మాచారం అంద‌లేద‌ని రాద్దాంతం చేసిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రా రెడ్డి ఎట్ట‌కేల‌కు నోరు విప్పారు. ప్ర‌భుత్వం నుంచి త‌న‌కు క‌బురు వ‌చ్చింద‌ని, గ‌వ‌ర్న‌ర్ ను క‌ల‌వాల‌ని స్ప‌ష్టం చేసింద‌ని తెలిపారు. ఈ మేర‌కు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ అపాయింట్ మెంట్ ఇస్తే తాను వెళ్లేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

అంత‌కు ముందు గ‌వ‌ర్న‌ర్ నుంచి స‌ర్కార్ కు రావాలంటూ లేఖ వ‌చ్చింద‌ని వెల్ల‌డించారు. క‌లిసేందుకు సంబంధించి అపాయింట్ మెంట్ ఇవ్వ‌మ‌ని కోరామ‌ని కానీ ఇప్ప‌టి దాకా గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం నుంచి రావాల‌ని కాని రావ‌ద్ద‌ని కాని స‌మాచారం రాలేద‌న్నారు మంత్రి. ఒక‌వేళ ప‌ర్మిష‌న్ ఇస్తే తాను వెళ్లేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

అయితే ఇందుకు సంబంధించి లేఖ అంద‌లేద‌న్నారు. గ‌వ‌ర్న‌ర్ కోరుతున్న సందేహాల‌ను , అనుమానాల‌ను నివృత్తి చేసేందుకు తాను సిద్దంగా ఉన్నామ‌ని చెప్పారు. బుధ‌వారం మంత్రి గ‌వ‌ర్న‌ర్ రాద్దాంతం పై చెల‌రేగిన దాని గురించి వివ‌ర‌ణ ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు జీఎస్టీ బిల్లుకు మాత్ర‌మే గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపారు.

మిగ‌తా బిల్లుల‌ను పెండింగ్ లో ఉంచారని తెలంగాణ స‌ర్కార్ ఆరోపిస్తోంది. ఇదే క్ర‌మంలో తెలంగాణ యూనివ‌ర్శిటీస్ కామ‌న్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై రాజ్ భ‌వ‌న్ కు వ‌చ్చి చ‌ర్చించాల‌ని విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రా రెడ్డిని(Sabitha Indra Reddy) ఆదేశించారు గ‌వ‌ర్న‌ర్. ఈనెల 7న మంత్రికి, యూజీసి లేఖ‌లు రాశారు. త‌న‌కు అంద‌లేద‌ని బుకాయించారు మంత్రి. ఈ మొత్తం వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది.

Also Read : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్

Leave A Reply

Your Email Id will not be published!