Nitish Kumar : రాబోయే ఎన్నికల్లో నేనేంటో చూపిస్తా
జేడీయూ చీఫ్..సీఎం నితీశ్ కుమార్
Nitish Kumar : జేడీయూ చీఫ్, సీఎం నితీశ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. బీహార్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
17 ఏళ్ల పాటు బీజేపీతో కొనసాగించిన బంధాన్ని తెంచుకున్నారు నితీశ్ కుమార్. ఆపై ఆర్జేడీ, కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
31 మందితో కేబినెట్ ను ఏర్పాటు చేశారు. తాజాగా మణిపూర్ లో ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జేడీయూకు. ఊహించని రీతిలో పార్టీ చీఫ్, సీఎం నితీశ్ కుమార్ కు షాక్ ఇచ్చారు.
5 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పారు. ఉన్నట్టుండి బీజేపీలో చేరారు. వెంటనే తేరుకున్నారు నితీశ్ కుమార్(Nitish Kumar) నిప్పులు చెరిగాడు బీజేపీపై. రాబోయే ఎన్నికల్లో తన సత్తా ఏమిటో చెబుతానని స్పష్టం చేశారు.
బీజేపీ దేశంలో ఎవరూ ఉండ కూడదని అనుకుంటోంది. రెండు రోజుల కిందట పాట్నాలో జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి మణిపూర్ కు చెందిన ఎమ్మెల్యేలంతా రావాల్సి ఉండగా అకస్మాత్తుగా బీజేపీలో విలీనం జరిగిందన్నారు నితీశ్ కుమార్(Nitish Kumar).
ఇదిలా ఉండగా శనివారం పాట్నాలో జరిగిన జేడీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీఎం హాజరై కీలక ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ భవిష్యత్తు చిత్రంగా ఉండబోదన్నారు.
రెండు రోజుల కిందట వారంతా రావాల్సి ఉందని కానీ బీజేపీ ప్రలోభాల కారణంగా పాట్నాకు రాలేక పోయారని మండిపడ్డారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని ఆరోపించారు.
భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు నితీశ్ కుమార్.
Also Read : సీరమ్..బిల్ గేట్స్ కు నోటీసులు