Rishi Sunak : ఆమె గెలిస్తే మంత్రిగా ఉండ‌ను – సున‌క్

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ప్ర‌ధాని అభ్య‌ర్థి

Rishi Sunak : బ్రిట‌న్ ప్ర‌ధాని రేసులో ఉన్న భార‌తీయ మూలాలు క‌లిగిన రిషి సున‌క్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్ప‌టికే నాలుగు రౌండ్ల‌లో టాప్ లో నిలిచారు రిషి సున‌క్. కానీ ఓపీనియ‌న్ పోల్స్ ల‌లో త‌న ప్ర‌త్య‌ర్థి లిజ్ ట్ర‌స్ కంటే వెన‌క్కి వెళ్లారు.

ఈ త‌రుణంలో క‌న్జ‌ర్వేటివ్ పార్టీలో కీల‌క‌మైన నేత‌గా ఉన్నారు రిషి సున‌క్. ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాల‌లో ప్ర‌ధానిగా ఉన్న బోరిస్ జాన్స‌న్ త‌ప్పుకున్నారు. త‌న ప‌దవికి రాజీనామా చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌కు ఘాటు స‌మాధానం ఇచ్చారు రిషి సున‌క్(Rishi Sunak). మీరు గ‌నుక ఒక‌వేళ ప్ర‌ధాని రేసు నుంచి త‌ప్పుకోవ‌డ‌మో లేదా ఓడి పోవ‌డమో జ‌రిగితే లిజ్ ట్ర‌స్ ప్ర‌ధాని సార‌థ్యంలో మంత్రిగా ప‌ని చేస్తారా అంటే కాద‌ని జ‌వాబు ఇచ్చారు.

గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా జాన్స‌న్ ప్ర‌భుత్వంలో , కేబినెట్ లో కీల‌క‌మైన పోస్ట్ నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇందుకు నేను గ‌ర్వ ప‌డుతున్నాన‌ని చెప్పారు రిషి సున‌క్.

నా అభిప్రాయాల‌ను స్వీక‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఆయ‌న ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా బీబీసీతో మాట్లాడారు. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేగింది.

లిజ్ ట్ర‌స్ న‌డిపే ప్ర‌భుత్వంలో తాను చేర‌బోన‌ని, ప‌ని చేయ‌న‌ని స్ప‌ష్టం చేశాడు రిషి సున‌క్. ఇది అత్యంత క‌ఠిన‌మైన అంశం. నేను ఇంకా బ‌రిలోనే ఉన్నాన‌ని పేర్కొన్నారు.

గ‌త నెల‌లో రాజీనామా చేశారు సున‌క్. చివ‌ర‌కు బోరిస్ జాన్స‌న్ ప్ర‌భుత్వ ప‌త‌నానికి దారి తీసింది. అయితే తాను రాబోయే మంత్రి ప‌ద‌వి గురించి ఆలోచించ‌డం లేద‌న్నారు.

Also Read : మిస్సైల్స్ మిస్ ఫైర్ ఆఫీస‌ర్స్ పై వేటు

Leave A Reply

Your Email Id will not be published!