Nitish Kumar Rahul Gandhi : రాహుల్ ప్రధాని అయితే ఓకే – నితీశ్
తాను పీఎం రేసులో లేనని ప్రకటన
Nitish Kumar Rahul Gandhi : జేడీయూ పార్టీ చీఫ్ , బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల నుంచి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అయితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా తాను పీఎం రేసులో లేనని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ఆయన మరోసారి కుండ బద్దలు కొట్టారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కోరారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటి అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీ ప్రతిపక్షానికి ముఖం కాగలరా అన్న దానిలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు.
అందులో తప్పేముందని ప్రశ్నించారు నితీశ్ కుమార్(Nitish Kumar) . అందరూ కలిసి ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అంతా కలిసి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు బీహార్ సీఎం. అయితే దేశంలోని కొందరు తనను కూడా ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని, అందులో ఎలాంటి తప్పేమీ లేదని పేర్కొన్నారు.
మిగతా పార్టీలు కూడా కలిసేందుకు రావాలని పిలుపునిచ్చారు నితీశ్ కుమార్. దేశాభివృద్ది ముఖ్యం. విద్వేష రాజకీయాలతో దేశం అట్టుడుకుతోందన్నారు. ఒక రకంగా ఆయన భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు. శనివారం బీహార్ లోని జ్ఞాన్ భవన్ లో నితీశ్ కుమార్ టీచర్లకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు సీఎం.
Also Read : బీజేపీని చూసి నేర్చుకుంటున్నా – రాహుల్