Satya Pal Malik : నేను ఏ పార్టీలో చేరను – సత్య పాల్
జమ్మూ కాశ్మీర్, గోవా మాజీ గవర్నర్
Satya Pal Malik : జమ్మూ కాశ్మీర్ , గోవా, మణిపూర్ రాష్ట్రాల మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. తాను ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. కానీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను ప్రజల కోసం పని చేసే అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని అన్నారు. చాలా మంది ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు తన వద్దకు వస్తున్నారని, మద్దతు ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. కానీ తాను సత్యం కోసం నిలబడిన వ్యక్తినని పేర్కొన్నారు.
2024లో జరిగే ఎన్నికలు ఈ దేశానికి అత్యంత ముఖ్యమైనవని అన్నారు సత్య పాల్ మాలిక్(Satya Pal Malik). ఎందుకంటే ఈ దేశం మోదీ 9 ఏళ్ల పాలనలో 20 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు. కేవలం డిజిటలైజేషన్ వల్ల దేశం అభివృద్ది చెందదన్న విషయం ముందు తెలుసు కోవాలని హితవు పలికారు. ఇవాళ మహిళా రెజ్లర్లు తమకు న్యాయం కావాలని కోరుతున్నారు. మరో వైపు మణిపూర్ మండుతోంది. రెండు తెగల మధ్య జరిగిన ఘర్షణలో కనీసం 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదేనా మనం కోరుకున్న జాతీయ సమాజం అని సత్య పాల్ మాలిక్ ప్రశ్నించారు.
ఆయన మరో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ లు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం మానుకోవాలని సూచించారు మాజీజ గవర్నర్. ఇద్దరూ కలిసి చర్చించు కోవాలని, రాబోయే ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లేలా తమను తాము సరి చేసుకోవాలని హితవు పలికారు.
Also Read : PM Modi To Lead : యుఎన్ లో యోగా సెషన్ కు మోదీ