IAS Officers : భారీగా ఐఏఎస్ ల బదిలీలు
సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
IAS Officers : హైదరాబాద్ – పాలనా పరంగా తనదైన ముద్ర వేస్తున్నారు కొత్తగా సీఎంగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి. ఆయన తన స్వంత టీమ్ ను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటి దాకా గతంలో కొలువుతీరిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పోస్టులలో ఉన్న వారందరికీ చెక్ పెట్టే పనిలో పడ్డారు. కీలకమైన ఐపీఎస్ లను తప్పించారు. మరికొందరికి అందలం ఎక్కించారు. కేసీఆర్ పక్కన పెట్టిన చాలా మందికి ఇప్పుడు పోస్టులు దక్కుతుండడం విశేషం.
IAS Officers Transfers Viral
తాజాగా మరో సంచలన నిర్ణయానికి తెర తీశారు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). 11 మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు ఝలక్ ఇచ్చారు. వీరిని బదిలీ చేయాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. దీంతో భారీ ఎత్తున ప్రక్షాళన చేపట్టారు.
తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అరవింద్ కుమార్ పై వేటు పడింది. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా బి. వెంకటేశంను నియమించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా దాన కిషోర్ , హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డికి అప్పగించారు.
ఇక వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమ కార్యదర్శిగా వాకాటి కరుణ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా ఆర్వీ కర్ణన్ ను బదిలీ చేశారు. అటవీ , పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ , జేఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అరవింద్ కుమార్ , రోడ్లు భవనాలు, రవాణా శాఖ కార్యదర్శిగా శ్రీనివాస్ రాజు ను నియమించారు సీఎం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ శాంతి కుమారి.
Also Read : Seethakka Minister : ములుగే నా కుటుంబం ప్రపంచం